10 Steps in Financial Planning Process

నమ్మకమైన సలహాదారులు, అదే విధంగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఫాలో అవుతారు. కొంచెం సులభమైన, స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టెప్స్ ని మనలాంటి వాళ్ళు కూడా నేర్చుకుని, అప్లై చేసి బెనిఫిట్స్ పొందవచ్చు. ఈరోజు నేను మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాసెస్ (Financial Planning Proccess in Telugu)  లో ఉన్న స్టెప్స్ ని ఫాలో అవ్వడం ద్వారా మీ ఫైనాన్సుని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 

10 Steps of Financial Planning Process

ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాసెస్ ప్రాక్టిస్ చేయడానికి మీరు ఈ కింది స్టెప్స్ తెలుసుకుని ఆచరించాలి. అయితే మీ ఆర్ధిక విజయం అనేది వీటిని అమలు చేయటం, అదే విధంగా జాగ్రతగా పర్యవేక్షించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. 

ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాసెస్ లో ముఖ్యమైన స్టెప్స్ ఏంటో చూసేద్దాం.

1. ఫైనాన్షియల్ స్థితిని నిర్ణయించడం.

2. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం.

3. డేటా కలక్ట్ చేయటం.

4. డేటాని ఎనలైజ్ చేయడం.

5. ప్రత్యామ్నాయలను గుర్తించడం.

6. ఒక ప్లాన్ ని తాయారు చేయడం.

7. ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం.

8. ప్లాన్ ని పర్యవేక్షించడం, అవసరం అయితే మార్పులు చేయడం.

9. ప్లాన్ ని అప్డేట్ చేయడం.

10. ఫైనల్ చేసిన స్ట్రాటజీ పై వర్క్ చేయడం లేదా ఆచరించడం.

కొంచెం వివరంగా వీటి గురించి మాట్లాడుకుందాం. 

1. ఫైనాన్షియల్ స్థితిని నిర్ణయించడం

మొట్టమొదట మీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలి. దానిని బట్టే మీరు తరువాత ఏం చేయగలరు అని తెలుస్తుంది. 

మొదట్లో మీరు మీ ఆదాయాలు, సేవింగ్స్, బతకటానికి కావాల్సిన ఖర్చులు ఇంకా అప్పులు వీటి గురించి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. దీని వలన మనం మీ ఆస్తులు అప్పులు ప్రిపేర్ చేయడం సులభం అవుతుంది. మన తదుపరి స్టెప్స్ కి ఇది సహాయ పడుతుంది. 

2. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం.

ఇప్పుడు మీరు మీ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, దాని కోసం మీరు పని చేయడం మొదలుపెట్టాలి. మీ లక్ష్యాలు మిమ్మల్ని ఎంత దూరం తీసుకువెళ్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు మీ కలలను నిజం చేసుకోవడానికి ప్రాక్టికల్ గా ఆలోచించడం మొదలు పెట్టాలి. లేకుంటే ఈ ప్రాసెస్ అంతే వృధానే. 

ఇందుకోసం ఫైనాన్షియల్ ప్లానర్స్ కొన్ని ప్రశ్నలను అడుగుతారు, వాటికీ మనం సరైన సమాధానాలు ఇవ్వగలగడం ద్వారా మనం ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి, మరింత బలోపేతం చేయటానికి ఉపయోగపడుతుంది. 

3. రిలవెంట్ డేటా కలక్ట్ చేయటం.

మీరు అందించే వాస్తవిక సమాచారం ఉపయోగకరమైన స్ట్రాటజీస్ క్రియేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇవి మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడంలో సహాయపడుతుంది. మీరు మీ గోల్స్ ని తక్కువ సమయంలో రీచ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా రిస్క్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ తో కూడుకున్నది అని మన అందరికి తెలుసు. 

అంబానీ, ఆదానిల ఆదాయం స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టడం వల్లనే పెరుగుతుంది అని మీకు తెలుసా. అయితే జాగ్రతగా ఒకటికి వంద సార్లు అలోచించి మీరు పెట్టుబడులు పెట్టాలి. 

4. డేటాని ఎనలైజ్ చేయడం.

మీ దగ్గర ఉన్న సమాచారం మీరు జాగ్రతగా విశ్లేషిస్తేనే మీరు మంచి నిర్ణయాల ద్వారా మంచి ఆదాయాన్ని పొందగలరు. లేకుంటే ఎవరో చెప్పారు అని మీరు రిస్క్ తీసుకున్న కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. 

5. ప్రత్యామ్నాయలను గుర్తించడం.

సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇన్కమ్ డెవలప్ చేయడం కీలకంగా పని చేస్తుంది. అంతే కాకుండా కొన్ని పాజిటివ్ చేంజ్స్ కూడా కనిపిస్తాయి. దాని వలన మీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి ఇంకొంత బలంగా అవుతుంది. 

మనం ప్రత్యామ్నాయలని పరిగణలోకి తీసుకోవడం వలన మన డెసిషన్ మేకింగ్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో డెసిషన్ మేకింగ్ అనేది అత్యంత కీలకమైనది. ఒకవేళ మనం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే మన ఆర్ధిక పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది కదా! 

6. ఒక ప్లాన్ ని తయారు చేయడం.

మీ బడ్జెట్ కి కావాల్సిన డబ్బు ఎంత అనేది తెలియడం వాళ్ళ మీకు సాధ్యాసాధ్యాలు తెలుస్తాయి. ఒకవేళ మీరు మార్కెట్ రిస్కులను బాగా హేండిల్ చేస్తుంటే మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మీ మిగిలన ఖర్చులు పెరగకుండా అలాగే ఉన్నట్లయితే మీ ఆదాయాన్ని పెంచడం కొంత సులభం అవుతుంది.

7. ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం.

ఇంప్లిమెంట్ అంటే మీరు ప్రిపేర్ చేసుకున్న దానిని అమలు చేయడం. ఒక గొప్ప వ్యూహాన్ని రచించడం కన్నా, దాని అమలు చేయడం పైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీ ప్లాన్ ని మీరు అనుకున్నట్లుగా అమలు చేయగలగాలి. కొన్ని అసాధారణ సందర్భాలలో తప్ప, మీ ప్లాన్ ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తుంది. 

ఆ ప్లాన్ ని అమలు చేయడానికి మీ నిగ్రహ శక్తి కూడా మీకు సహాయ పడాలి. మీ ప్లాన్ ద్వారా రిజల్ట్స్ రావడం మొదలయినప్పుడు మీకు మీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది. 

8. ప్లాన్ ని పర్యవేక్షించడం, అవసరం అయితే మార్పులు చేయడం.

మీ ప్లాన్ విజయవంతంగా ఇంప్లిమెంట్ అవుతుండగా మీరు దానిని రెగ్యులర్ గా రిజల్ట్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఏవైనా అవసరం అయితే మార్పులు చేర్పులు చేయాలి. అందుకే నేను ఇంతకూ ముందు చెప్పను, డెసిషన్ మేకింగ్ పవర్ అనేది  కీరోల్ ప్లే చేస్తుంది అని, కొన్ని సార్లు మన జీవితంలో కలిగే కొత్తగా జరిగే మార్పులు మన ఆర్ధిక లక్ష్యాలు మార్చుకోవడానికి, క్రొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి కారణం అవుతాయి. ఉదాహరణకు, పెళ్లి, పిల్లలు, ప్రొమోషన్, బిజినెస్ ఇలా. 

9. ప్లాన్ ని అప్డేట్ చేయడం.

మనం రెగ్యులర్ గా చెక్ చేస్తూ, చేంజ్స్ చేస్తుంటే దానికి తగ్గట్లుగా మనం కూడా అప్డేట్ అవ్వాలి. లేకుంటే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కుదరదు కదా! మీరు మీ ప్లాన్ ను అంచనా వేస్తూ ఉండాలి. కాలానుగుణంగా మీరు అంచనా వేస్తూ, అందుకు తగ్గట్లుగా అప్డేట్ అవుతూ ఉండాలి. 

ఉదాహరణకి పెళ్లి అయిన క్రొత్తలో మీ భాగస్వామి, మీ సంతోషం కోసం ప్లాన్ చేసుకోవాలి. కొంతకాలం తరువాత పిల్ల గురించి ఆలోచించాలి. వాళ్ళ చదువులు, ఆరోగ్యం, భవిష్యత్తు. ఇంకొంత కాలానికి రిటైర్మెంట్ గురించి ఇలా. ఒకవేళ ముందు నుండే ఇవి ప్లాన్ లో ఉంటె ఇబ్బంది లేదు. లేకుంటే కాలానుగుణంగా మనం మన ఫైనాన్షియల్ ప్లాన్ ని అప్డేట్ చేసుకోవాలి కదా! 

10. ఫైనల్ చేసిన స్ట్రాటజీ పై వర్క్ చేయడం లేదా ఆచరించడం.

ఇంకా ఇప్పుడు మీకు ఎట్లాంటి ఫార్మటు అవసరం లేదు. ఎందుకంటె మీరు రెగ్యులర్ గా మీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ, దాన్ని మాడిఫై చేస్తూ, అప్డేట్ చేస్తూ మీ ఆర్ధిక లక్ష్యాలు రీచ్ అవుతూ ఉంటె సరిపోతుంది. అంతిమంగా మనం మన ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవాలి. 

సింపుల్ గా చెప్పాలి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కి ఈ స్టెప్స్ అన్ని ముఖ్యమైనవి. అయితే మీరు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఈ స్టెప్స్ ని ఉపయోగించి మీ ఫైనాన్షియల్ ప్లాన్ ని క్రియేట్ చేసుకోండి. ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ కావాలి అంటే ఎప్పుడు మీరు మీ ప్లాన్ ని రివల్యువేట్ చేస్తూ ఉండాలి.

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.

Spread the love