Chanakya Neeti for Financial Success

చాణక్యుడు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ఈరోజుల్లో. ఎన్నో విషయాల గురించి అయన చెప్పారు అని మనకి తెలుసు, అర్థ శాస్త్రం అందులో బాగా ఫేమస్. అయన అర్థశాస్త్రం మాత్రమే కాకుండా ఎన్నో విషయాలు చెప్పినట్లు, స్ట్రాటజీస్ లో ఆయన్ని కొట్టే వాళ్ళు లేరు అని, ఈరోజు విదేశీయులు అనుకుంటూ ఉన్నారు. Chanakya Neeti for Financial Success in Telugu

చాణక్యుడు రాజనీతి, మేనేజ్మెంట్, అర్థశాస్త్రం, యుద్ధనీతి, నాయకత్వం, పరిపాలన ఇంకా ఎన్నో విషయాలు తెలియచేసారు. ఆగండాగండి! ఇప్పుడు నేను చాణక్యుడి గురించి చెప్పడానికి రాలేదు. చాణిక్యుడు చెప్పిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నా. 

అయన ఎన్నో గ్రంధాలు రచించారు. వాటిల్లో నుండి మనకి కావాల్సిన వాటిని మనం తెలుసుకుందాం.

ఫైనాన్షియల్ సక్సెస్ కోసం చాణక్య నీతి

1) ఫైనాన్షియల్ ప్లానింగ్ కి చాణక్య నీతి

పక్కగా ప్లాన్ చేసుకున్న తర్వాతే ఒక పని మొదలుపెట్టాలి. ఆర్థిక రంగంలో కూడా అదే వర్తిస్తుంది. ప్లానింగ్ లేకుండా మీరు ఫైనాన్షియల్ సక్సెస్ పొందలేరు. ప్రతికూల పరిస్థితులలో కూడా మంచి ప్లానింగ్ తో  కూడిన పని మంచి రిజల్ట్స్ ఇస్తుంది. 

మీ పని బాగా ప్లానింగ్ తో చేస్తే, ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చాణక్య నీతి చెబుతుంది. మార్కెట్ బ్యాడ్ కండిషన్ లో కూడా మీరు  ప్లానింగ్ తో ఉంటే మీరు మరింత లాభం పొందే అవకాశం ఉంది.

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్లానింగ్ ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తుంది. ఉదా. మీరు ఎటువంటి ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోకపోతే మీరు అత్యవసర పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోవచ్చు. మీరు మన బ్లాగ్ కనుక ఫాలో అవుతుంటే నేను ఇంతకూ ముందు బ్లాగ్స్ లో కూడా ఎమర్జెన్సీ ఫండ్స్ గురించి చాలా సార్లు చాలా చోట్ల చెప్పాను. 

2) రిస్క్ అసెస్మెంట్ కోసం చాణక్య నీతి

ఒక పనిని ప్రారంభించే ముందే మనం మన సామర్థ్యాన్ని అంచనా వేయాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ ముందు మీరు రిస్క్ ప్రొఫైల్ అంచనా వేయాలి. మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ రూపొందించడంలో రిస్క్ అసెస్‌మెంట్ మీకు హెల్ప్ చేస్తుంది.

ఎవరి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి అటువంటి ఆభరణాలు ధరించాలి. అంటే మీ ఆదాయం మరియు సామర్థ్యాన్ని బట్టి మీరు డబ్బు ఖర్చు చేయాలి. మితిమీరిన ఖర్చు మిమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. అంతే కాకుండా మిమ్మల్ని అప్పుల ఊబిలో పడవేస్తుంది. 

3) ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కోసం చాణక్య నీతి

కొలిమిలో కాల్చకుంటే బంగారం ఆభరణం కాదు. అంతే కాకుండా అందు,ఓ ఎంత మోతాదులో ఏది ఉండాలో అవి ఉండాలి. లేకపోతే ఆ ఆభరణానికి అందం రాదు, దానికి విలువ ఉండదు. 

అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ కి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. అది ఎట్లా అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు, స్టేబుల్ వేల్యూ ఉన్నవాటిని సెలెక్ట్ చేసుకోవాలి.

Note: ఈ బ్లాగ్ లో చెప్పిన స్టాక్స్ డీటెయిల్స్ మీకు స్టాక్స్ పరంగా అవగాహనా తీసుకురావడం కోసం మాత్రమే. ఈ బ్లాగ్ ఎటువంటి స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టమని చెప్పదు. కేవలం ఆర్ధిక అంశాలపై అవగాహనా కల్పించడమే మా ముఖ్య ధేయ్యం. 

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, WhatsApp లో జాయిన్ అవ్వండి.

Spread the love