Personal Finance ఎట్లా ట్రాక్ చేయాలి?

మీ పర్సనల్ ఫైనాన్సుని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. ఎవరికైతే తమ పర్సనల్ ఫైనాన్సు గురించి, అదే విధంగా తమ సంపాదన ఏమవుతుంది, ఏం చేయాలి అనే క్లారిటీ ఉంటుందో అటువతి వారు తమ ఫైనాన్షియల్ గోల్స్ త్వరగా రీచ్ అవుతారు. 

మీ పర్సనల్ ఫైనాన్స్ మైంటైన్ చేయడం కష్టంగానే ఉండవచ్చు. అయితే అందుకోసం మీరు కొన్ని టిప్స్ తెలుసుకోగలిగితే మీకు మీ పర్సనల్ ఫైనాన్సు మేనేజ్ చేయడం సులభం అవుతుంది. 

1. మీరు డబ్బుని దేనికోసం ఖర్చు పెడుతున్నాం అని అర్థం చేసుకోవాలి. 

పర్సనల్ ఫైనాన్స్ మైంటైన్ చేయడంలో అత్యంత ముఖ్యమైనది, మీ డబ్బు ఎలా ఖర్చు అవుతుంది అనేది. యావరేజ్ గా ఒక మనిషి తక్కువలో తక్కువ నెలకు 12 ట్రాన్సాక్షన్స్ చేస్తాడు అంట.

బిల్ల్స్ పే చేయడం కావచ్చు, రెస్టారెంట్లకి వెళ్ళడం కావచ్చు, రోజువారీ ఖర్చులకోసం ఇలా ఏవైనా కావచ్చు. అయితే ఎందుకోసం మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. 

ఒకవేళ మీకు దేనికోసం మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అని తెలియకపోతే 2-3 నెలలు మీ ఖర్చులను ట్రాక్ చేయండి. అప్పుడు మీకు ఎంత డబ్బు ఎలా ఖర్చు అవుతుంది అని అర్థం అవుతుంది. అప్పుడు అవసరం లేని ఖర్చులు మీరు తగ్గించుకోవచ్చు. 

2. ఖర్చులు తగ్గించుకునే మార్గాలు వెతకడం. 

ఒక్కసారి మీకు మీ ఖర్చులు తెలిసాక, మీరు ఎక్కడ వాటిని తగ్గించుకోవాలి అని ఒక అవగాహన వస్తుంది. ఖర్చులు తగ్గించుకోమన్నాను కదా అని అసలు  బయటకి వెళ్ళద్దు, ఎంజాయ్ చేయవద్దు అని కాదు. కాకపోతే తగ్గించుకోవచ్చు. 

ఉదాహరణకి మీరు నెలకి 4 సార్లు రెస్టారెంట్లు/ సినిమాలకి వెళ్తారు అనుకుందాం. వాటిని నెలకి 2 సార్లకి తగ్గించండి. అప్పుడు మీకు కొంత ఖర్చు తగ్గుతుంది. అదే విధంగా కిరాణా సరుకులు లాంటివి మీకు ఏం కావాలో వాటిని నెలకి ఒకసారి తెచ్చుకునేలా ప్లాన్ చేసుకోండి.

ఈ విధంగా చేయడం వలన మనం మన ఖర్చులు తగ్గించుకుని కొంత మొత్తాన్ని ఆదా చేయవచ్చు. (ఆదా చేయకపోయినా ఖర్చులు అయినా తగ్గించుకోవచ్చు కదా!) 

3. ఆన్లైన్ పేమెంట్స్ చేయండి.

మీకు విలైనవాన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయండి. అందువల్ల మనం దేనికోసం స్పెండ్ చేస్తున్నాం అని మనం ట్రాక్ చేసుకోవడానికి స్టేట్మెంట్స్ ఉపయోగపడతాయి. దానివలన మనం ఏ నెల బిల్లులు ఏ నెల చెల్లించాం, అదే విధంగా బిల్ల్స్ మిస్ చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. 

మీరు మీ ఖర్చులను ఆన్లైన్ ద్వారా నోట్ చేయడం లేదా ట్రాక్ చేయడం వలన ఇంకా మీ ఎకౌంటు లో ఎంత డబ్బు ఉంది, ఏంటి అనే విషయాలు మీకు సులభంగా అర్థం అవుతాయి.

4. ఆటోమేటిక్ గా సేవ్ చేయడం అదే విధంగా ట్రాన్స్ఫర్ చేయండి. 

ఈరోజు మనకి పేమెంట్ యాప్స్ ఆటోమేటిక్ పేమెంట్స్ చేయటానికి సహాయం చేస్తున్నాయి. అదే విధంగా ఒక డేట్ సెట్ చేసి పెడితే ఆ డేట్ కి మనకి ఆటోమేటిక్ గా మన సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ లో అమౌంట్ యాడ్ అయిపోతున్నాయి.

ఇటువంటి వాటిని ఉపయోగించడం వలన మొదట మన కనీస అవసరాలు అదే విధంగా సేవింగ్స్ రెండూ పూర్తీ అవుతాయి. తరువాత మిగిలిన వాటిని మనం ఖర్చు పెట్టవచ్చు. 

ఒకవేళ మీరు మీ ఆర్ధిక లక్ష్యాలను (ఫైనాన్షియల్ గోల్స్) అందుకోలేకపోతున్నారు అంటే మీరు మీ పర్సనల్ ఫైనాన్సు మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది.  లేదంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. అంతే కాకుండా జీవిత చరమాంకంలో కూడా పని చేయాల్సి వస్తుంది.

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.

Spread the love