ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగాలి, డబ్బు సంపాదించాలి, హ్యాపీగా ఉండాలి అని ఉంటుంది. అయితే అందులో ఒక 5-10% మంది మాత్రమే వాళ్ళ కలలను నెరవేర్చుకుంటున్నారు. మరి మిగితా వాళ్ళు ఎందుకు వాళ్ళు అనుకున్నది సాధించాలేకపోతున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
మనలో చాలా మంది డబ్బు సంపాదించాలి, ఎటువంటి ఇబ్బందులు ఎదురయినా వాటిని పరిష్కరించడానికి డబ్బు కావాలి. ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉన్న కూడా వాళ్ళకి కావాల్సిన ఆర్ధిక స్వాతంత్ర్యం లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలేకపోతున్నారు. ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
మీరు సంపాదించిన డబ్బు, మీరు కోరుకుంటున్నట్లు మారట్లేదు అంటే అందుకు ప్రధాన కారణం మీకు ఆర్ధిక అక్షరాస్యత లేదా జ్ఞానం (ఫైనాన్షియల్ లిటరసి) లేకపోవడమే. మరి మనం ఆర్ధిక అక్షరాస్యత ఎలా సాధించాలి? అందుకోసం మనం ఫైనాన్షియల్ బుక్స్ చదవచ్చు, కోర్సులలో జాయిన్ అవవ్వచ్చు, లేదా మెంటార్స్ ని ఫాలో అవ్వడం ద్వారా అట్లాంటి నాలెడ్జ్ పొందవచ్చు.
నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడి, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుని, వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వాటి రిజల్ట్స్ ని చూస్తున్నాను. కాబట్టి వాటిని మీకు కూడా షేర్ చేయాలి అని ఈ బ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫైనాన్షియల్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలియచేయడం.
ఫైనాన్షియల్ విషయాల పైన అవగాహన సాధించడం, వాటిని మీ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అని మీరు అలోచించి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మనం కూడా ధనవంతులుగా మారడం అంత కష్టమైన విషయం ఏం కాదు. అందుకు ఆర్ధిక క్రమశిక్షణ, నేర్చుకోవాలి అనే తపన, కొంచెం రిస్క్ చేయగలిగే తత్వం ఉంటె చాలా త్వరగా మీరు కూడా ధనవంతులు కావచ్చు.
ఒకవేళ మీకు ఏవిధమైన సందేహాలు ఉన్న, సూచనలు కావాలి అన్నా మాకు తెలియచేయండి. మీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తాం.
– Finance Badi Team