పర్సనల్ గా అయినా బిజినెస్ లో అయినా డబ్బు చాలా ముఖ్యం. డబ్బు లేకుండా మనం ఏం చేయలేము. అయితే ఫైనాన్షియల్ సక్సెస్ సాధించాలి అనుకుంటే పర్సనల్ ఫైనాన్స్ కి, బిజినెస్ ఫైనాన్స్ కి తేడ తెలుసుకోవాలి. మీరు వ్యాపార ప్రపంచంలో ఎదగాలి అనుకున్నా లేదా ఆర్ధిక స్థిరత్వం సాధించాలి అనుకున్నా మీరు మీ లక్ష్యాలను నిజంగా సాధించగాలరా అని నిర్ణయించడంలో పర్సనల్ ఫైనాన్స్, ఇంకా బిజినెస్ ఫైనాన్స్ కీలక పాత్ర వహిస్తాయి.
Table of Contents
మనీ మేనేజ్మెంట్ కన్నా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ ఫైనాన్స్ మధ్యగల వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం కొంత క్లిష్టంగా ఉంటుంది. అంతే కాకుండా అందులో ఉన్న ప్రత్యెక లక్షణాలను అర్థం చేసుకోవడం పైన ఆధారపడి ఉంటుంది.
పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏంటి? What is Personal Finance in Telugu
సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక వ్యక్తికీ సంబంధించిన వ్యక్తిగత ఆర్ధిక వనరులను మేనేజ్ చేయడం చేయడం. ఇందులో ప్రధానంగా వ్యక్తీగత ఆర్ధిక లక్ష్యాలు, బడ్జెటింగ్, సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పై దృష్టి నిలపడం జరుగుతుంది. మీ పర్సనల్ ఫైనాన్స్ ని సమర్ధంగా మైంటైన్ చేయడం వలన లేదా మేనేజ్ చేయడం వలన మీ లైఫ్ స్టైల్ కి తగ్గట్లు ఒక స్థిరమైన ఫైనాన్షియల్ ప్లాన్ క్రియేట్ చేసుకోవచ్చు.
బిజినెస్ ఫైనాన్స్ అంటే ఏంటి?
బిజినెస్ ఫైనాన్స్ అంటే ఆ వ్యాపారానికి సంబంధించిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడం. ఇందులో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇంకా ఎన్నో అంశాలు ఉంటాయి. మీ బిజినెస్ యొక్క ఫైనాన్సు మేనేజ్ చేయడం ద్వారా వ్యాపార లాభాలు ఇంకా కంపెనీ లేదా సంస్థ యొక్క ఆర్ధిక పరిస్థితిని నిర్ధారించవచ్చు.
బిజినెస్ ఫైనాన్స్ అర్థం చేసుకోవడం కోసం సంక్లిషమైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, పన్నుల చట్టాలు వంటి మరెన్నో విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక బిజినెస్ ఓనర్ గా మీ బిజినెస్ ఫైనాన్స్ ని ఒక అకౌంటెంట్ లేకుండా మేనేజ్ చేయడం కష్టమైన పని.
అకౌంటెంట్లు మీ వ్యాపారంతో సంబంధం లేకుండా మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించగల ఆర్థిక నిపుణులు. ఉదాహరణకు, మీరు కాంట్రాక్టర్ అయితే, కాంట్రాక్టర్ల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో నైపుణ్యం కలిగిన కొంతమంది ఉత్తమ కాంట్రాక్టర్ అకౌంటెంట్లను మీరు సంప్రదించవచ్చు.
అయితే మీ ఫైనాన్షియల్స్ మీరు అకౌంటెంట్ తో మేనేజ్ చేస్తున్నారా లేదా అనే దాని కన్నా బిజినెస్ ఫైనాన్స్ కి పర్సనల్ ఫైనాన్స్ కి మధ్య గల తేడాలు తెలుసుకోవాలి. దీని వలన మీరు చక్కగా ప్లాన్ చేసుకోవడం మాత్రమే కాకుండా మీ పర్సనల్, బిజినెస్ గోల్స్ రీచ్ అవ్వడానికి తోడ్పడుతుంది.
ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.