Financial Freedom & Financial Confidence

ఈరోజు మనదరం డబ్బు గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు వంటి వటు గురించి సింపుల్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మొదలు పెడదాం. 

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి?

మీ రూల్స్ ప్రకారం మీరు బతకడం, అలా బ్రతకాలి అంటే మీకు డబ్బు కావాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే. దాని వాళ్ళ కలిగే లాభాలు ఏంటో చూద్దాం.

మనీ టెన్షన్ లేకపోవడం  

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీ మనీ టెన్షన్స్ ని ఒక సూపర్ హీరో తన్నినట్లు తంతుంది. పొద్దున్నే మనం కట్టాల్సిన బిల్లుల గురించి, EMI ల గురించి ఆలోచిస్తూ లేవల్సిన అవసరం లేదు. మీ బ్యాంకు బాలన్స్ ని ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన వాటిని అంది పుచ్చుకుంటూ సంతోషంగా జీవించవచ్చు. 

సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్

అంటే మీరు డబ్బులో ఈత కొట్టడం లాంటిది కాదు. మీకు ఎంత అవసరమో దానిని సంపాదించుకుని, మీకు కావాల్సిన సేవింగ్స్ చేసుకోవడం, మీ ఫ్యూచర్ కోసం ఈరోజు సంతోషంగా గడపడం కోసం. అంటే ప్రతీది మీరు సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్, మీ డ్రీమ్స్, గోల్స్, అడ్వెంచర్స్ లాంటివి. 

9-5 చట్రం నుండి బయటపడడం

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే రోజు వారి ఆర్ధిక కష్టాల నుండి బయట పడడం. సాహజంగా మనం మన రోజువారీ ఖర్చుల కోసమే కదా జాబ్స్ చేసేది. దాని నుండి బయట పాడటానికి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సహాయపడుతుంది. మీకు నచ్చి పని చేయాలి కానీ, పని చేయక తప్పని పరిస్థితికి కాదు. 

ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు అంటే ఏంటి?

ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు అంటే మనీ మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకునే నేర్పు. అందులో మనం నిష్ణాతులం అవ్వడం. ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు ఒక్కరోజులో వచ్చేది కాదు, ఇందుకోసం ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. కష్టపడకుండా ఏది రాదని మీకు తెలుసు కదా! 

నాలెడ్జ్ ఎ పవర్

ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ అనేది డబ్బు నిర్ణయాల విషయంలో బాస్ లాగా భావించడం. ఇది ధనవంతుల గురించి కాదు, ఇది మీ ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడం. మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే, మీరు మరింత నమ్మకంగా ఉంటారు. 

ప్రో లాగా బడ్జెటింగ్ చేయడం

ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు సింపుల్ బడ్జెట్‌తో ప్రారంభమవుతుంది. ఇది మనీ రోడ్‌మ్యాప్‌ను కలిగి ఉన్నట్లే. మీ డబ్బు ఎలా ఖర్చు అవుతుందో మీకు తెలుస్తుంది. అది మీ పతనం కోసం కాకుండా మీ ఉన్నతి ఎలా  పని చేయాలో మీరు ప్లాన్ చేసుకోవాలి. బడ్జెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదే.

ఫైనాన్షియల్ ఛాలెంజ్స్ ఫేస్ చేయడం

జీవితం అనేక సవాళ్ళని విసురుతుంది. అప్పుడు మీరు మీ ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ తో సిద్దంగా ఉండాలి. అవి ఊహించని ఖర్చులు కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. మీరు వాటిని ఫేస్ చేయగలిగితేనే మీ ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకు మీకు ఫైనాన్షియల్ లిటరసీ(ఆర్ధిక జ్ఞానం) సహాయ పడుతుంది. 

ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు రెండూ ఉంటె!

ఈ రెండూ రేర్ కాంబినేషన్. ఒకవేళ మీలో ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రెండూ ఉంటె ఏమవుతుందో తెలుసుకుందాం! 

ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉపయోగాలు

క్లియర్ గోల్స్

మీకు ఏం కావాలో మీకు తెలుస్తుంది. దానికోసం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకోండి. దీనివల్ల మీరు ఎప్పుడు ఏం చేయాలి అని మీకు తెలుస్తుంది. ఒకరకంగా ఒక నిధిని వెతకటానికి కావాల్సిన మ్యాప్ మీ దగ్గర ఉన్నట్లే. 

స్మార్ట్ బడ్జెటింగ్

ప్రాక్టికల్ బడ్జెట్ ని క్రియేట్ చేయండి. ఇది మీ సరదాలని మొత్తం తీసేయడం కోసం కాదు, మీ కోరికలను, అవసరాలను బాలన్స్ చేయడం కోసం. మీ గోల్స్ కి తగ్గట్లు మీ డబ్బు ఉండేట్లు చేయడం కోసం. 

నిరంతరం నేర్చుకోవడం

డబ్బు విషయాలపై ఆసక్తిగా ఉండండి. చదవండి, క్వశ్చన్స్ అడగండి, నేర్చుకోండి. మీరు ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే, అంత స్మార్ట్ ఆర్థిక ఎంపికలు చేయడంలో మీరు మరింత కాన్ఫిడెంట్ గా ఉంటారు.

ఎమర్జెన్సీ ఫండ్

జీవితం సర్ప్రైస్లతో నిండి ఉంది. కాబట్టి సేఫ్టీ నెట్ రూపొందించండి – ఎమర్జెన్సీ ఫండ్. ఇది మీ ఫైనాన్షియల్ సూపర్‌హీరో, ఊహించని ఖర్చులు ఎదురయ్యే రోజు కోసం ఆదా చేయడానికి సిద్ధంగా ఉండండి. 

క్లుప్తంగా చెప్పాలంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది డబ్బు ఒత్తిడి లేకుండా జీవించే సామర్ధ్యం, అయితే ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు అనేది తెలివిగా డబ్బు కదలికలను ఎలా తయారు చేయాలనేది. మీరు రెండింటినీ మిళితం చేసినప్పుడు, మాయాజాలం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ మనీ షిప్‌కి కెప్టెన్‌గా ఉంటారు, ఎంపికలు మరియు విశ్వాసంతో నిండిన భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తున్నారు.

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.

Spread the love