ప్రతి వ్యక్తికి ఫైనాన్స్ విషయంలో తనదైన ప్రిన్సిపల్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఆర్థిక విషయాలు వివాహిత జంటల మధ్య వివాదాలకు అతిపెద్ద కారణం అవుతుంటాయి. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు లేదా ఆర్థిక ప్రాధాన్యతలలో తేడా వల్ల కావచ్చు. కొన్నిసార్లు ఈ డబ్బు వ్యవహారాలు విడాకుల వంటి విపరీతమైన పరిస్థితికి దారితీస్తాయి.
సరైన అవగాహనను పెంపొందించుకోవడం మరియు ఫైనాన్షియల్ ఫ్యూచర్ ను కలిసి పనిచేయడం ద్వారా సురక్షితంగా ఉంచడానికి, ఈ సంఘర్షణ దంపతుల మధ్యనే సులభంగా పరిష్కరించబడుతుంది. అందుకే పెళ్లి అయిన జంటల కోసం కొన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ టిప్స్ (Financial Planning for Couples):
Financial Planning for Couples
పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికీ (పెళ్లి కుదిరిన వారికీ)
- చాలా మంది వ్యక్తులు పెళ్ళికి ముందు జాతకాలూ కుదిరాయ అని చెక్ చేస్తారు, కానీ భవిష్యత్ భాగస్వామితో కలలు, ఆకాంక్షలు & ప్రాధాన్యతలను సరిపోల్చడం గురించి ఆలోచించరు. జీవితంలోని ప్రతి అడుగులోనూ మీకు డబ్బు అవసరమని మర్చిపోవద్దు. మీ భాగస్వామి కలలు, ఆకాంక్షలు & మీ ప్రయారిటిస్ చెక్ చేసుకోండి.
- మీ పార్టనర్ యొక్క ఫైనాన్షియల్ హాబిట్స్ & ఫైనాన్షియల్ విషయాల పట్ల క్యాపబులిటి చెక్ చేయడానికి ప్రయత్నించండి. అంటే అవసరం లేదు అనుకుంటే ఖర్చు చేయకుండా ఉండగలరా అని.
- వివాహ జీవితాన్ని ప్రారంభించే ముందు తగినంత డబ్బు ఆదా చేసుకోండి. వివాహం అనేది కొత్త బాధ్యత మరియు వివాహానికి ముందు మరియు తర్వాత అన్ని అవసరాలను చూసుకోవడానికి మీరు ఫైనాన్షియల్ గా రెడీగా ఉండాలి.
- మీరు మీ వివాహానికి అయ్యే ఖర్చుకు బాధ్యత వహించే వ్యక్తి అయితే, బడ్జెట్‌లో వివాహ ఖర్చును మేనేజ్ చేయడానికి ప్రయత్నించండి (అధికంగా ఖర్చు చేయవద్దు) మీరు లోన్ లేదా అప్పు తీసుకోవలసిన పరిస్థితిని నివారించండి.
క్రొత్తగా పెళ్లి అయిన వారికి
- మీరు మీ వివాహానికి బహుమతిగా డబ్బును (చదివింపులు) స్వీకరిస్తే, వాటిని ఖర్చు చేయవద్దు. కొత్త జాయింట్ సేవింగ్ బ్యాంక్ ఖాతాలో వాటిని డిపాజిట్ చేయడం లేదా కలల ఇల్లు లేదా పిల్లల వంటి మీ భవిష్యత్తు కలల కోసం వాటిని పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన.
- మీ ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ లో ఏదైనా మార్పు చేయడం ద్వారా, ముందుగా మీ గోల్స్ రీచ్ అవ్వడంలో మీకు హెల్ప్ అవుతుందా, లేదా అని విశ్లేషించండి.
- మీ ఆర్థిక జీవితం యొక్క బాధ్యత గురించి డిస్కస్ చేయండి, మీ ఆలోచనలు షేర్ చేసుకోండి. ఉదా. బిల్లు చెల్లింపు, ఖర్చులను ట్రాక్ చేయడం లేదా బ్యాంక్ సంబంధిత లావాదేవీలకు ఎవరు బాధ్యత వహిస్తారు.
ఇంటి నిర్వహణ కోసం
- ఇంటి ఖర్చుల గురించి మీ పార్టనర్ తో డిస్కస్ చేయండి. సరైన బడ్జెట్‌ను క్రియేట్ చేయండి. బడ్జెట్‌కు మించి డబ్బు ఖర్చు చేయకండి. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందు మీ పార్టనర్ గురించి ఆలోచించండి.
- మీ భాగస్వామి ఎందులో బెస్ట్ గా ఉంటారో కనుగొని, అందుకు తగ్గట్లుగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీ భాగస్వామి బేరసారాల్లో బెస్ట్ అయితే, బడ్జెట్‌లో కొంత భాగాన్ని ఖర్చు చేసే బాధ్యతను తనకి ఇవ్వాలి. మీరు పెట్టుబడిని అర్థం చేసుకోవడంలో ఇంట్రెస్ట్ ఉండి నాలెడ్జ్ ఉంటె మీరు బడ్జెట్‌లో కొంత భాగాన్ని సేవింగ్స్ /ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం పై ఫోకస్ చేయాలి.
- మీ గోల్స్ & ప్రయారిటీస్ ఇంకా వాటిని రీచ్ అవ్వడానికి స్టెప్స్ ని లిస్టు చేయండి. మీరు దేని గురించి అయినా తీవ్రంగా ఆలోచిస్తుంటే పోరాడటానికి బదులుగా మార్గాన్ని కనుగొనడానికి మీ పార్టనర్ తో మాట్లాడండి. ఇద్దరు కలిసి దాని పరిష్కారానికి ప్రయత్నించండి.
- మీరు మాత్రమే ఇంటిలో సంపాదన పరులు అయితే మరియు మీ భార్య గృహిణిగా ఉన్నట్లయితే అయితే, మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే టర్మ్ ఇన్సురన్సు తీసుకోవడం. ఇది మీ కుటుంబానికి అనుకోని సంఘటనల నుండి ఆర్ధిక రక్షణ కల్పిస్తుంది.
- ఎమర్జెన్సీ ఫండ్ యొక్క కార్పస్‌ను క్రియేట్ చేసుకోవడానికి ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసే ఏర్పాటు చేసుకోండి. కొన్ని అవసరాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. మీరు వాటి కోసం ప్లాన్ చేసుకుని సిద్దంగా ఉండాలి.
- మీ హెల్త్ బాగుంటే అంతా బాగుంటుంది. ఫ్యామిలీ హెల్త్ ఇన్సురన్స్ పాలసీని తీసుకోండి. అందువల్ల మీరు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు డబ్బుల కోసం వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
- మీ పార్టనర్ కి తెలియకుండా ఎప్పుడూ ఏది దాచవద్దు. ఆర్థిక సమస్యలను మీతో ఉంచుకోవడం మంచిది కాదు. మీ భాగస్వామితో మీ ఆర్థిక ఆందోళన గురించి చర్చించండి మరియు ఆమె సపోర్ట్, సజెషన్స్ అడగండి. తప్పేమీ కాదు, ఎందుకంటె ఏ ఇద్దరు ఒక సమస్యని ఒకే కోణంలో చూడలేరు.
- మీరు కలిగి ఉన్న ఆస్తులు, అప్పుల గురించి, ప్రతిదాని లిస్టు ప్రిపేర్ చేయండి. మీ ప్రతి ఆర్థిక విషయాలు/లావాదేవీల గురించి మీ భాగస్వామికి తెలియజేయండి.
- 3 నెలలకి ఒకసారి మీ ఆర్థిక పరిస్థితి, డ్రీమ్స్ & గోల్స్ అస్సెస్ చేయండి. మీరు మీ గోల్ ని చేరుకోగలరా లేదా అని చెక్ చేయండి. లేకపోతే సరైన దిశలో అవసరమైన చర్యలు తీసుకోండి.
- మీ పార్టనర్ అతనికి/ఆమెకు ఇష్టం లేకుండా ఎటువంటి పని చేయకండి. ప్రతి ఒక్కరికి భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. ఒకరు వెంటనే ఆర్థిక నిర్ణయాన్ని తీసుకోవచ్చు, మరొకరు ఆలోచించడానికి కొంత సమయం పట్టవచ్చు.
- మీ పార్టనర్ అవసరాన్ని పట్టించుకోండి. మీ భాగస్వామ్యానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. మీ భాగస్వామిని సహచరులుగా పరిగణించండి. మీ భాగస్వామిని అర్థం చేసుకోండి. అతని/ఆమె అవసరాన్ని పరిగణించండి మరియు ప్రతిస్పందించండి.
- మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో వీక్ గా ఉంటే, మంచి నెలవారీ ఇన్వెస్ట్మెంట్ బ్లాగ్ / కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. లేదా ఫీజు ఆధారిత ఫైనాన్షియల్ ప్లానర్ నుండి సలహా తీసుకోండి.
“కలిసి మీరు మరింత సాధించగలరు” అని గుర్తుంచుకోండి.
Note: ఈ బ్లాగ్ లో చెప్పిన స్టాక్స్ డీటెయిల్స్ మీకు స్టాక్స్ పరంగా అవగాహనా తీసుకురావడం కోసం మాత్రమే. ఈ బ్లాగ్ ఎటువంటి స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టమని చెప్పదు. కేవలం ఆర్ధిక అంశాలపై అవగాహనా కల్పించడమే మా ముఖ్య ధేయ్యం.
ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, WhatsApp లో జాయిన్ అవ్వండి.