Four Pillars of Personal Finance in Telugu

మీ డబ్బు మీ అదుపులో ఉంటె మీరు మీకు నచ్చినట్లు ఏమైనా చేయవచ్చు కదా! ప్రతీనెలా మీ మంత్లీ బడ్జెట్ తో బతికేయడం ఎవరికి అంత ఇంటరెస్టింగ్ గా ఉండకపోవచ్చు. అదే ప్రతీనెల మీ సేవింగ్స్ పెరుగుతూ ఉంటె భలే ఉంటుంది కదా! 

ఎప్పుడు ఆర్థికంగా ఒకేరకంగా ఉండదు అనే విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బు విలువ నిరంతరం మారుతూ ఉంటుంది, కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది, కొన్నిసర్పు తగ్గుతూ ఉంటుంది. 

మరి మన దగ్గర ఉన్న డబ్బు విలువ పెరగాలి అంటే మనం ఖచ్చితంగా పర్సనల్ ఫైనాన్స్ పైన దృష్టి పెట్టాలి. పర్సనల్ ఫైనాన్స్ మనకి బాగా అర్థం కావాలి అంటే పర్సనల్ ఫైనాన్స్ నాలుగు స్థంబాల గురించి తెలుసుకోవాలి. అవును, Four Pillars of Personal Finance

1. అసెట్స్ & సేవింగ్స్

మనకి ఎప్పుడు అవసరం అయినప్పుడు మనం దానిని డబ్బుగా మర్చుకోగాలమో దానిని అసెట్స్ అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతూ ఉంటారు.  చాలా మంది పోర్ట్ఫోలియో లో కామన్ గా ఉండే అసెట్ ఇల్లు. అయితే చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కల మాత్రమే. 

ఒకవేళ మీరు సొంత ఇంటి పై అప్పు లేదా తాకట్టు ఉంటె మీ నెట్ వర్త్ అంటే నికర వేల్యూ నుండి దానిని మినిహయిస్తారు. అంతే కదా! అది మనకి ఉన్న అప్పు, అప్పును ఎప్పుడు ఆస్తిగా పరిగణించలేము కదా. 

మీ సేవింగ్స్ ఎకౌంటు లో ఉన్న డబ్బు, ఈక్విటీస్, మీ ఇన్సురెన్స్ పాలసీలు, బంగారం ఇవన్ని కూడా అసెట్స్ కిందకే వస్తాయి. ఒకవేళ మీరు మీ కార్ ని కూడా ఈ నలుగు స్తంబాలలో చేర్చినట్లు అయితే కాలక్రమంలో దానికి తరుగుదల( Depreciation) ఉంటుంది. ఒక్కోసారి ఆ కార్ కనుక లోన్ లో తీసుకుని EMI కడుతుంటే అది కూడా అప్పు అవుతుంది కానీ అసెట్ కాదు. 

2. అప్పులు & భాద్యతలు

అప్పులో మంచి అప్పు, చెడ్డ అప్పు అంటూ ఏం ఉండదు. అప్పు లేకుండా ఉండటమే మంచిది. మీకున్న అప్పులను త్వరగా మీరు ప్రయత్నించాలి. ఒకవేళ మీకు చాలా లోన్స్ ఉంటె అది మీ క్రెడిట్ స్కోర్ ని తగ్గించేస్తుంది. 

కొన్ని సందర్భాల్లో వాటిని తీర్చడం కోసం మళ్ళి ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థతి ఏర్పడవచ్చు. దాని వలన మీరు మీ నెలవారీ ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం తవ్వుకున్న గోతిలో మనమే పడుతూ ఉంటాము. 

3. ఆదాయ మార్గాలు

మనం అనేక విధాలుగా డబ్బు సంపాదించవచ్చు. మనం మన ఆదాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, జాబు తో పాటుగా  అదనపు ఆదాయ మార్గాల కోసం చూస్తూ ఉంటాం. ఈ ఇంటర్నెట్ యుగంలో మనకి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 

నెలజీతం, మూలధన లాభాలు (capital gains), రెంటల్స్, బిజినెస్ ఇన్కమ్ ఇంకా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాలు, ఇవి 5 రకాలు. మీరు మీ రోజువారీ లేదా కుటుంబ భాద్యతల కోసం వీటిల్లో రెండింటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. అయితే సేవింగ్స్ కావాలి, ఇప్పుడున్న స్థితిని అధిగమించాలి అనుకుంటే మాత్రం ఇంకొక మార్గం కూడా ఎన్నుకుని కష్టపడాలి. 

4. ఖర్చులు

మన వ్యాపారం కోసం లేదా మన దైనందిన జీవినం కోసం మనం చేసే ఖర్చులను మనం పరిశీలించాలి. నాల్గవ పిల్లర్ లో మనం పెట్టె ప్రతి ఖర్చు ఇంక్లుడ్ అవుతుంది. మనం కొనుకున్నే బట్టలు, ఇంట్లోవాడే సరకులు, గ్యాస్, పాలు, మన ఉద్యోగులకి ఇచ్చే జీతాలు, రెంట్ ఇలా ప్రతిదీ. మీకు మీ ఆర్ధిక పరిస్థితి ఏంటి అని తెలియాలి అంటే ఖచ్చితంగా బడ్జెట్ లో ఖర్చులను నిక్కచ్చిగా కలుపుకోవాలి. ఒక్క రూపాయి కూడా వదలకూడదు. 

ఈ నాలుగు పిల్లర్స్ ని మనం జాగ్రతగా అర్థం చేసుకుంటేనే మనం పర్సనల్ ఫైనాన్స్ బాగా మేనేజ్ చేయగలం. మీ బడ్జెట్ పైన మీకు అదుపు ఉంటేనే మీరు ప్రశాంతంగా ఎటువంటి (ఆర్ధిక) ఇబ్బందులు లేకుండా జీవించగలరు. 

ఒకవేళ మీరు బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవడం కష్టమే కానీ, దాని వలన మీకు మీ ఖర్చుల పైన అదుపు వస్తుంది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఎక్కడికి పెరిగెడతాం చెప్పండి. కాబట్టి ఈ నలుగు పిల్లర్స్ ని అర్థం చేసుకుని వీటిని భాగం చేసుకుంటే అటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.

Spread the love