How to avoid Financial Threats in Telugu

మీ డబ్బును, అదే విధంగా ఆర్ధిక నేరగాళ్ల బెదిరింపుల నుండి మీ కష్టాన్ని కాపాడుకోవాలి అంటే ముందుగా మీకు ఆర్ధిక బెదిరింపుల గురించి తెలియాలి.

డిజిటల్ బ్యాంకు రివ్యూస్ చదవడం మంచిది. దానితో పాటుగా ఈ బ్లాగ్ పోస్ట్ కూడా మీకు సహాయపడుతుంది.  అటువంటి ఆర్ధిక బెదిరింపులు ఎదుర్కొన్నపుడు ఏం చేయాలి అని మీకు ఒక అవగాహన వస్తుంది. 

ఈ బెదిరింపులలో ఏది చివరకు మిమ్మల్ని ఎట్రాక్ట్ చేస్తుందో మీకు ఎప్పటికీ తెలియదు. మీకు ఎప్పుడూ జరగకపోయినా, ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కదా!

ఫైనాన్షియల్ థ్రెట్స్ (ఆర్ధిక బెదిరింపులు) అంటే ఏంటి?

ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క డబ్బు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్  మరియు అనేక ఇతర రిసోర్సెస్ కి ముప్పు. ఫైనాన్షియల్ థ్రెట్స్ స్కోప్  చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్ (గుర్తింపు దొంగతనం) స్కామ్‌ల నుండి విదేశీ మారక (ఫారెక్స్) మోసాల వరకు ఏదైనా కావచ్చు. 

ఫైనాన్షియల్ థ్రెట్స్ అనేవి కామన్ ఆన్‌లైన్ స్కామ్స్, ముఖ్యంగా వృద్ధులు వారి రెగ్యులర్ ఆన్‌లైన్ ఆక్టివిటీస్ నిర్వహిస్తున్నప్పుడు ఎదుర్కొంటారు. కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు, మీ టాక్స్ ఫైల్ చేసేటప్పుడు  లేదా బిజినెస్ రిలేటెడ్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు వారు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది.

అవి ransomware, వైరస్‌లు, ట్రోజన్‌లు మరియు స్పైవేర్ వంటి మాల్వేర్‌లు కూడా కావచ్చు. టార్గెట్ చేసుకున్న బాధితుడి నుండి ప్రైవేట్ పర్సనల్ మరియు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ పొందేందుకు నేరస్థులు ఉపయోగిస్తారు.

మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్స్ పర్యవేక్షించండి

మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్స్ అనధికార కార్యకలాపాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సర్వర్ బ్రీచ్స్ (ఉల్లంఘనలు), వీక్ పాస్‌వర్డ్‌లు మరియు ఫిషింగ్ స్కీమ్‌లను ఉపయోగించుకున్న హ్యాకర్‌లకు ప్రతి సంవత్సరం మిలియన్ల డాలర్లు పోతున్నాయి. 

మీ బ్యాంక్ ఎకౌంటును రెగ్యులర్ గా చెక్ చేయడం వల్ల ఫ్రాడ్స్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక ఇంపార్టెంట్ స్టెప్. మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్ బ్యాంక్ ఎకౌంటు సేవలను ఉపయోగించినట్లయితే, మీ బ్యాంక్ ఎకౌంటు స్టేటస్ చెక్ చేయడం ఎంత ఈజీనో  మీకు బహుశా తెలిసే ఉండవచ్చు. 

ఇంటర్నెట్ ద్వారా లాగిన్ చేయడం ద్వారా మీ బ్యాంక్ ఖాతాలో ఏ సమయంలో ఎంత డబ్బు ఉందో మీరు చూడవచ్చు. మీరు మీ ఇంటి సౌలభ్యం వద్ద మీ ఖాతాను పర్యవేక్షించడమే కాకుండా, మీరు ప్రపంచంలో ఎక్కడి నుండైనా దీన్ని చేయవచ్చు.

ఈ మధ్య అందరూ UPI యూస్ చేయడం వల్ల ఇది ఇంకా ఈజీ అయ్యింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోయినా మొబైల్ బ్యాంకింగ్ తో సులభంగా ఎకౌంటు ని యాక్సెస్ చేయవచ్చు. 

1. ఫ్రాడ్ రిస్క్ తగ్గించుకోవాలి

ఫ్రాడ్  రిస్క్  తగ్గించడంలో మీ బ్యాంక్ ఎకౌంటు ని రెగ్యులర్ గా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ స్టెప్. ఇది మొదట్లో ఇబ్బందిగా అనిపించినప్పటికీ, అవసరమైనప్పుడు ఆన్ మరియు ఆఫ్ చేయడం చాలా సులభం!

2. హిడెన్ ఫీజులను అవైడ్ చేయండి

కొన్నిసార్లు మనకి కొన్ని ఎక్స్ట్రా ఛార్జ్స్ పడుతూ ఉంటాయి. చిన్న చిన్న అమౌంట్స్ అయితే మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం, అయితే ఇటువంటి ద్వారా ఆన్లైన్ స్కామర్స్ ఫ్రాడ్స్ చేసే అవకాసం ఉంది. కాబట్టి ఇటువంటివి నోటీసు చేసిన వెంటనే బ్యాంకు అధికారులకు మనం తెలియచేయాలి.

స్ట్రాంగ్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోండి. 

మీ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఎవరైనా యాక్సెస్ చేయకుండా ఉంచడానికి  స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవడం మరియు వాటిని తరచుగా మార్చడం బెస్ట్ వే అని మీకు తెలుసా?

స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌స్ సైబర్ నేరగాళ్లకు మీ ఖాతాలను హ్యాక్ చేయడం కష్టతరం చేస్తాయి. బలమైన పాస్‌వర్డ్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చూద్దాం. (మాకు తెలుసులేవో అనుకుంటున్నారా? తెలియని వాళ్ళ కోసంలే  గురు! కోప్పడకు)

  • కనీసం 8 అక్షరాల పొడవు (లెంగ్త్) ఉండే స్ట్రాంగ్, స్పెషల్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. అడిషనల్ సెక్యూరిటీ కోసం నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, కాపిటల్ లెటర్స్ & స్మాల్ లెటర్స్ యాడ్ చేయండి.
  • మీ డేట్ అఫ్ బర్త్ (పుట్టిన తేదీ), ఫోన్ నంబర్ వంటి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ పాస్‌వర్డ్‌గా ఉపయోగించడం మానుకోండి.
  • మీ పాస్‌వర్డ్‌లుగా కామన్ నేమ్స్ & ఈజీగా  గుర్తుంచుకోవడానికి మార్గాలను ఉపయోగించడం మానుకోండి.

పాస్వర్డ్ మేనేజర్ ని ఉపయోగించండి

సోషల్ మీడియా, క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంక్ అకౌంట్స్, ఇమెయిల్ మరియు క్లౌడ్ సర్వీసెస్ వంటి మీ ఆన్‌లైన్ అకౌంట్స్ కోసం స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయడానికి, పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించండి. ఇది కొత్త పాస్‌వర్డ్‌లు మరియు పాత వాటిని ట్రాక్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తుంది, అలాగే మీ అకౌంట్స్ లోకి ఎంటర్ అవ్వడానికి  హ్యాకర్లు యూస్ చేసే బ్రూట్ ఫోర్స్ అటాక్ మెథడ్స్  నుండి మెరుగైన రక్షణను అందిస్తుంది.

Note: ఈ బ్లాగ్ లో చెప్పిన స్టాక్స్ డీటెయిల్స్ మీకు స్టాక్స్ పరంగా అవగాహనా తీసుకురావడం కోసం మాత్రమే. ఈ బ్లాగ్ ఎటువంటి స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టమని చెప్పదు. కేవలం ఆర్ధిక అంశాలపై అవగాహనా కల్పించడమే మా ముఖ్య ధేయ్యం.

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, WhatsApp లో జాయిన్ అవ్వండి.

Spread the love