ఈ సంవత్సరం మన కరువు తీర్చుకోవడం ఎలా? (How to Control Expenses in 2024)
ప్రతి సంవత్సరం ఎంతో మంది న్యూ ఇయర్ రిసోల్యుషన్ చేసుకుంటారు, ఈ సంవత్సరం ఎలాగైనా ఇంత అమౌంట్ సేవింగ్ చేస్తాను అని, లేదా ఇంత లోన్స్ క్లియర్ చేయాలి అని. అయితే అందులో అత్యధిక శాతం మంది ఫెయిల్ అవుతూ ఉంటారు.
4 Steps to Get Your Finances in Control This Year in Telugu
ఎందుకంటే పర్సనల్ ఫైనాన్స్ ని మేనేజ్ చేయడం అంత సులభం కాదు, అంతే కాకుండా ఆచరణ యోగ్యం కాని శపధాలు చేసి విఫలం అవుతూ ఉంటారు.
ఒకవేళ మీరు కూడా న్యూ ఇయర్ కోసం అటువంటి రిసోల్యుషన్ తీసుకుంటే ఈ బ్లాగ్ మీ కోసమే. మీ రిసోల్యుషన్ బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం 4 స్టెప్స్ నేను చెప్తాను.
మీరు ప్రతీ వారం మీ ఫైనాన్స్ ని మేనేజ్ చేయడం మొదలు పెట్టండి.
మీరు ఈరోజు ఆర్థికంగా ఎటువంటి స్థితిలో ఉన్నారు అనేది ప్రక్కన పెట్టండి. ఒకవేళ మీరు మీ ఆర్ధిక పరిస్థితి మీ కంట్రోల్ లో ఉండాలి అనుకుంటే రెగ్యులర్ గా మానిటర్ చేయడం అలవాటు చేసుకోండి.
ఇందులో మీ మంత్లీ ఇన్కమ్, మీ ఖర్చులు, మీ సేవింగ్స్ ఇంకా మీ క్రెడిట్ స్కోర్ రెగ్యులర్ గా మానిటర్ చేయాలి.
మీ ఇన్కమ్ అంటే మీకు నెల మొత్తం వచ్చే ఆదాయం. అదే విధంగా ఖర్చులు అంటే ఒక్క రూపాయి కూడా వదలకుండా ప్రతిదీ. సేవింగ్స్ అంటే ఇంత వరకు సేవ్ చేసినవి.
వీటిని మీరు రెగ్యులర్ గా మోనిటర్ చేస్తుంటే, మీ ఆదాయ వ్యయాల ఆధారంగా బడ్జెట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా మీ ఆర్ధిక పరిస్థితి కూడా బాగా అర్థం అవుతుంది.
ఇదే విధంగా మీరు 2-3 నెలలు చేస్తే మీకు ఏమేమి ఖర్చులు తగ్గించుకోవాలి, మీరు మిమ్మల్ని ఎలా మార్చుకోవాలి అని మీకు అర్థం అవుతుంది. (ఖర్చులు అంటే తగ్గించాగాలిగినవి అని, పూర్తిగా ఖర్చుపెట్టకుండా పిసినారి గా ఉండమని కాదు.) అప్పుడు మీరు మీ సేవింగ్స్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
మీ పర్సనల్ ఫైనాన్స్ కి తగ్గట్లుగా బడ్జెట్ క్రియేట్ చేసుకోండి.
బడ్జెట్ క్రియేట్ చేసుకుని దాని తగ్గట్లుగానే మనం మన జీవన విధానం మలుచుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం లో ముఖ్యమైన అంశం. మీరు క్రియేట్ చేసుకున్న బడ్జెట్ మీ లైఫ్ స్టైల్ కి తగ్గట్లుగా క్రియేట్ చేసుకునేది కాబట్టి మీ గోల్స్ రీచ్ అవ్వడం అంత కష్టం ఏమి కాదు.
బడ్జెట్స్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలలో ఒకటి, ఒకరికి సూట్ అయినవి ఇంకొకరికి సూట్ కాకపోవడం. అది వాస్తవికంగా ఉండాలి.
ఉదాహరణకి మీ రవాణా ఖర్చులకోసం నెలకి 4000 రూపాయలు అవుతాయి అనుకుందాం. కానీ మీరు సరిగ్గా లెక్క వేసుకోకుండా 3000 లేదా 3500 కేటాయించారు అనుకుందాం. లేదా అనవసరంగా ఇంకొక 1000 రూపాయాలు ఖర్చు చేసారు అనుకుందాం. అప్పుడు ఆ అదనపు డబ్బు ఎలా మేనేజ్ చేస్తారు. అంటే మీ బడ్జెట్ సరిగ్గా మేనేజ్ అవ్వటం లేదు.
ఇలాంటి వాటి వల్ల బడ్జెట్ అనేది వర్క్ అవుట్ కాదు. మీ బడ్జెట్ మీకోసం తయారు చేసింది అవ్వాలి, అంతే కాకుండా మీ ఫ్రెండ్ బడ్జెట్, మీ పార్టనర్ లేదా ఫైనాన్షియల్ బ్లాగర్ బడ్జెట్ వర్క్ అవుట్ కాదు, ఎందుకంటె ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ భిన్నంగా ఉంటాయి. మరి అట్లాంటి బడ్జెట్ ని మీరు ఫాల్లో అయితే ఎలా వర్కౌట్ అవుతుంది.
మీకోసం ఒక మంచి బడ్జెట్ క్రియేట్ చేసుకోవడం కోసం టైం పడుతుంది, ఇంకా దానికోసం మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సి రావచ్చు. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. ఈ మాట ఏదో సినిమాలో విన్నట్లు గుర్తు, నాకు కూడా ఇది నిజమే అనిపిస్తుంది.
మీ ఖర్చులను తగ్గించుకోవడం, జాగ్రతగా ఖర్చు పెట్టడం ఇలాంటివి ఒక్క రోజులో జరగదు కదా! కొంచెం టైం పడుతుంది. అంత వరకు వెయిట్ చేయాలి. గొప్ప గొప్ప విషయాలకి టైం పడుతుంది కదా!
మీరు దేని కోసం అయినా మీరు అతిగా ఖర్చు పెడుతున్నారో లేదా తక్కువగా ఖర్చు పెడుతున్నారు అని తెలిస్తే మీకు ఎలా సర్దుబాటు చేసుకోవాలి అని తెలుస్తుంది.
సో అక్కడి నుండి మీకు మీ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఇది మీరు నిరంతరం చేయగలిగితే మీ ఆర్ధిక పరిస్థితి మెరుగవుతూ ఉంటుంది.
మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకుంటేనే మీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులను, మీ సేవింగ్స్ గోల్స్ రీచ్ అవ్వవచ్చు. ఇంకా మీ జీవితంలో సంతోషాన్ని తిరిగి పొందవచ్చు.
టెక్నాలజీని ఉపయోగించుకోండి.
మన పర్సనల్ ఫైనాన్స్ ని మెరుగు పరచుకోవడం కోసం ఈరోజు మనకి ఎంతో టెక్నాలజీ అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఎన్నో యాప్స్ కూడా ఉన్నాయి. మొదటగా మీరు మీ బ్యాంకు ఎకౌంటు కి మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ఆక్టివేట్ చేయించుకోండి.
ఎప్పటికప్పుడు మన ఖర్చులను తెలుసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. అన్ని మనకి గుర్తు ఉండవు కదా! అన్నింటిని మనం వెంటనే నోట్ చేయం కదా!
ఒక్క మాట చెప్పాలి అంటే మనం మొబైల్ బ్యాంకింగ్ ని మన పర్సనల్ ఫైనాన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం మోసమే కనిపెట్టారు అనుకోవచ్చు! దాని నుండి లాభాన్ని కూడా ఆశించవచ్చు.
అన్ని రకాల ప్రయోజనాలు కలిగించే కార్డులను ఎంచుకోండి.
కార్డ్స్ అంటే చాలా మందికి ఇవి చెడ్డవి అనే అభిప్రాయం రావచ్చు. అయితే మీరు అనుకున్నంత కాదు. మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా మీ పర్సనల్ ఫైనాన్స్ ని మెరుగుపరుస్తాయి.
ఈ రోజు మార్కెట్ లో ఎన్నో రకాల క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి, అయితే వాటిల్లో నుండి మీకు సరైన కార్డు ని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం.
సరైన కార్డు అంటే, మీ లైఫ్ స్టైల్ అదే విధంగా మీ స్పెండింగ్ హాబిట్స్ కి తగ్గట్లుగా ఏ కార్డ్స్ ఉన్నాయి, వాటి వాళ్ళ మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలి.
సాధారణంగా అన్ని క్రెడిట్ కార్డ్స్ మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి మీ క్రెడిట్ ని ఇంప్రూవ్ చేసేవి, మీ డబ్బులపై వచ్చే వడిని ఆదా చేసేవి, ఇంకా మీ స్పెండింగ్స్ పై రివార్డ్ పాయింట్స్ ఇచ్చేవి. మీ అవసరాలకు తగిన కార్డ్స్ ని ఎంచుకోవడం వలన మీరు దానిని కూడా ఒక టూల్ లాగ యూస్ చేసుకోవచ్చు.
మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. అప్పుడు మీరు మంచి ట్రావెల్ కార్డు తీసుకోవాలి అనుకుంటారు.
అయితే అలా కాకుండా మీరు మీ కార్డు ని ఎక్కువ శాతం మీ కుటుంబ ఖర్చుల కోసం, లేదా మిగితా వాటి కోసం ఉపయోగిస్తుంటే మీకు బెస్ట్ ట్రావెల్ కార్డు వల్ల పెద్దగ ఉపయోగం ఉండదు.
మీ పర్సనల్ ఫైనాన్స్ ని కంట్రోల్ చేయడం రాత్రికి రాత్రి జరిగే పని కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ & స్ట్రాటజీ. ఒకేసారి రాత్రికి రాత్రి అన్ని మార్చుకోవాలి అనుకునే బదులు మెల్లిగా మీరు చేయగలిగిన వాటిని ఆచరించడం ద్వారా మీరు మీ ఆర్ధిక లక్ష్యాలను రీచ్ అవ్వగలరు.
వాటిని రీచ్ అయ్యాక మళ్ళి ఇంకొన్ని గోల్స్ పెట్టుకుని వాటిని రీచ్ అవ్వండి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటె మీరు మెల్లిగా మీ సేవింగ్స్ ని పెంచుకోవచ్చు, అంతే కాకుండా మనీ మేనేజ్మెంట్ కూడా సులభంగా చేసుకోవచ్చు.
మరి అయితే ఈ సంవత్సరం మీ ఆర్ధిక లక్ష్యాలు ఏంటి? వాటిని అందుకోవడం కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు. మనీ మేనేజ్మెంట్ లో ఇంకా ఎలాంటి అంశాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అని కామెంట్స్ లో తెలియచేయండి.
ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, Whatsapp లో జాయిన్ అవ్వండి.