How to make a financial plan in Telugu

రీసెంట్ గా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందా? అయితే మీకు ఇప్పటికే మీకు డబ్బు అవసరం, ఆవశ్యకత తెలిసే ఉంటాయి. మనీ మేనేజ్ చేసుకోలేకపోవడం, తక్కువ శాలరీ, మన అవసరాలకి సరిపోని డబ్బు ఇవన్ని మనలో ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తాయి. కొత్త విషయాలు చెప్పు గురు అంటారా! 

మీరు మీ ప్రపంచాన్ని మార్చుకోవాలన్నా, మీ రన్నింగ్ రేస్ నుండి త్వరగా బయట పడాలి అన్నా మీకు కావాల్సిన ఒకే ఒక్కటి డబ్బు….డబ్బు….డబ్బు…. ఆ విషయం మాకు కూడా తెలుసు. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావ్ అనుకుంటున్నారా?

కాబట్టి మీకు హ్యాపీ & సాటిస్ఫైడ్ లైఫ్ కావాలా? మీరు జీవించాలనుకునే లైఫ్ స్టైల్ ని సెలెక్ట్ చేసుకున్నపుడు హ్యాపీ గా ఉంటుంది. అంతే కాకుండా ఆ లైఫ్ స్టైల్ మీ కెరీర్‌తో పాటుగా బాలన్స్  చేస్తే మీరు మీ కలలను నెరవేర్చుకోవచ్చు. 

మీరు మరియు మీ కలలు టైం ఇంకా మరియు డబ్బుతో మాత్రమే వేరు చేయబడ్డాయి. మీ గోల్ ని మీరు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అదే విధంగా మీ డబ్బుని కూడా జాగ్రతగా ప్లాన్ చేసుకుంటే అవసరం అయినప్పుడు వాళ్ళని, వీళ్ళను అడగాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. 

డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అది సరిగ్గా మీ అవసరాలకి తగ్గట్లు పెరగాలి అని కూడా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ గోల్స్ ఫుల్ ఫిల్ చేసుకోగలరు.  మీ జీవిత ప్రయాణంలో అసెస్‌మెంట్, బడ్జెటింగ్, గోల్ సెట్టింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, రీఅసెస్‌మెంట్, మీ డబ్బు మరియు ఆస్తిని పర్యవేక్షించడాన్ని పర్సనల్ ఫైనాన్స్ అంటారు. 

సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కి కొన్ని స్టెప్స్

ఫైనాన్షియల్ అసెస్‌మెంట్

ప్రస్తుతం మీ రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, షాపింగ్, వెకేషన్స్ ఇలా అన్నింటిని ఒక లిస్టు లో రాయండి. అవసరమైన, అత్యవసరమైన, సరదాలకి చేసే ఖర్చులను విడివిడిగా రాయండి. అర్జెంటు అంటే మీకు ఉన్న లోన్ ఈఎంఐ, సరదా ఖర్చు అంటే రెగ్యులర్ గా రెస్టారెంట్ కి వెళ్ళడం లాంటివి. 

గోల్ సెట్టింగ్

అనవసర ఖర్చులను ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా తగ్గించండి. మీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ని మీ అవసరాలకి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకి షార్ట్ టర్మ్ గోల్ అంటే ఒక సంవత్సరంలో ఆఫీస్ కి వెళ్ళడానికి బైక్ కొనడం. లాంగ్ టర్మ్ గోల్ అంటే 10 సంవత్సరాలలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేయడం లాంటివి. మీకు లైఫ్ లో మీకు ఉన్న గోల్స్ ని ఈ విధంగా ఒక టైం ఫ్రేమ్ తో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ని సెట్ చేసుకోండి. 

బడ్జెటింగ్

ముఖ్యమైన పనులుకు అవసరమైన మొత్తం, ఇంకా మిగిలన వాటితో ప్రెజెంట్ మీ లైఫ్ కి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవాలి అంటే, మీ అవసరాల కోసం పెరిగే విధంగా మీ ఖర్చును పరిమితం చేయడాన్ని బడ్జెట్ అంటారు.

మీరు 50/30/20 పాపులర్ ఫార్ములా ని  ఉపయోగించవచ్చు, మీ ఇన్కమ్ లో  50% ఫుడ్, ట్రాన్స్పోర్ట్, లోన్స్ వంటి అతి ముఖ్యమైన వాటికీ, 30% షాపింగ్, సినిమా వంటి లైఫ్ స్టైల్స్ కోసం మరియు మిగిలిన 20% సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు అత్యవసర నిధులు కోసం ఖర్చు పెట్టాలి. నా వ్యక్తిగత సలహా, అత్యంత సక్సెస్ఫుల్ మిలియనీర్లు చేసే విధంగా 30% లైఫ్ స్టైల్ ఖర్చులను, 20% సేవింగ్స్  లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి  మార్చడానికి ప్రయత్నించండి. 

ప్లాన్ క్రియేషన్

బిజినెస్ అయినా, పర్సనల్ ఫైనాన్స్ అయినా లేదా ఒక ఈవెంట్ కండక్ట్ చేయటం అయినా ఏది కూడా ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ ని మార్చలేదు. ఏ రంగంలో అయినా స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఏవిధంగా ఒక రోడ్ మ్యాప్ లా పని చేస్తుందో పర్సనల్ ఫైనాన్సు లో కూడా అదే విధంగా పని చేస్తుంది. ఫైనాన్షియల్ ప్లాన్ అనేది మీ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో ఉన్న షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. మీ ప్లాన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇంకా ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం ఎంత మొత్తం అని కేటాయించాలి. 

నోట్: మీ అప్పులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేయండి.

ఎగ్జిక్యూషన్ / ఇంప్లిమెంటేషన్

“An idea without execution is a hallucination” అని ఒక ఇంగ్లీష్ కోట్. ఒక ప్లాన్ ని పక్కగా ఇంప్లిమెంట్ చేయడమే, ప్లాన్ కన్నా ముఖ్యమైనది. మీ సంపాదన అంత త్వరగా ఖర్చు చేయాలి అనే తుత్తర మీకు ఉండచ్చు, కానీ దాని కన్నా కూడా మీ ఫ్యూచర్ కోసం చేసుకున్న ప్లాన్ ఆధారంగా సేవ్ చేయటానికి భాద్యతగా ఉండాలి.

సైకాలజీ పరంగా ఏదైనా ఒక పని 21 రోజులు చేస్తే అది ఒక అలవాటు గా మారుతుంది అని చెబుతుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక 50 రోజుల పటు మీ ఫైనాన్షియల్ ప్లాన్ కి అనుగుణంగా మీ ఖర్చులను తగ్గించుకుంటే భవిష్యత్ ఫలాలు ఆస్వాదించగలరు. 

మోనిటరింగ్ & రీఅసెస్‌మెంట్

ఎమర్జెన్సీ రూపంలో ఎప్పుడు  అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి లాంగ్ రన్ లో ఒకే ప్లాన్ ని ఫాల్లో అవ్వడం కష్టం. కాబట్టి మీ ఖర్చులకి అనుగుణంగా 3 నెలలకి ఒకసారి మీ ప్లాన్ ని మార్పులు చేయండి. అందువల్ల లాంగ్ టర్మ్ లో మీ ఫైనాన్షియల్ సక్సెస్ ని అందుకోగలరు. 

తగిన రక్షణ

అవాంఛిత ప్రమాదాలు అంటే  ఆక్సిడెంట్, మరణం, వ్యాధి వంటి ఎమర్జెన్సీ పరిస్థితులు తప్పించుకోలేము. ఈ సమస్యల నుండి బయటపడటానికి సరైన ద్రవ్య రక్షణ (Monetary Protection) అవసరం. ఈరోజు మన ఫైనాన్షియల్ వరల్డ్ హెల్త్, లైఫ్, వెహికల్ మొదలైన అనేక ఇన్సురెన్స్  సౌకర్యాలను అందిస్తుంది. మీరు సరైన ఇన్సురెన్స్ కలిగి ఉంటె ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ఆ పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు బయటపడేయడం ఉత్తమం.

ఇన్సూరెన్స్ కంపెనీ అనేక బీమా పథకాలను అందిస్తుంది కాబట్టి మీరు స్పెసిఫిక్ స్కీం నుండి బెనిఫిట్ అయ్యే అస్స్యుర్డ్ అమౌంట్ మరియు సౌకర్యాలను చెక్ చేశారా లేదా అని నిర్ధారించుకోండి. ఉదాహరణకు, కొన్ని ఆరోగ్య బీమాలు వైద్య ఆపరేషన్ ఖర్చును మాత్రమే అందిస్తాయి, మరికొన్ని మెడిసిన్, ICU బిల్లు వంటి ప్రీ మరియు పోస్ట్ మెడికల్ ఖర్చులను అందిస్తాయి కాబట్టి మీరు కష్టపడి సంపాదించే ప్రీమియంలతో ఎక్కువ ప్రయోజనం పొందేలా చూసుకోవచ్చు.

టాక్స్ ప్లానింగ్

అవును, టాక్స్ పేమెంట్ ద్వారా మీ బ్యాంక్ ఖాతా డెబిట్ అయినప్పుడు మీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను. కానీ మన టాక్స్ పేమెంట్స్ ద్వారా సమాన జీవన అవకాశాలను పొందడం ప్రతి మనిషి ప్రాథమిక హక్కు అని మీరు ఒప్పుకోవాలి. టాక్స్ పేమెంట్ తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ప్రతి ఒక్కరికీ అనేక అవకాశాలను కల్పిస్తుంది అని మీకు తెలుసా?  

అవును, మీరు మీ పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు, ఉదాహరణకు, మీరు ఇన్సురెన్స్ ప్రీమియంలు చెల్లించడం ద్వారా సంవత్సరానికి 1.5 లక్షల వరకు టాక్స్ ఎక్సంప్షన్ ద్వారా తగ్గించుకోవచ్చు. మీరు ప్రభుత్వ బాండ్ల నుండి మీ రాబడిని టాక్స్ ఫ్రీ గా సేవ్ చేయవచ్చు.

టాక్స్ ప్లానింగ్ అనేది పన్నులు చెల్లించకుండా పారిపోవడం కాదు, పన్నులు చెల్లించకుండా డబ్బు ఆదా చేసుకునే అవకాశాలను కనుగొనడం. “ఒక రూపాయి ఆదా చేసిన ఒక రూపాయి సంపాదించినట్లే” అని అంటారు ఆర్థికవేత్తలు.

మార్ట్గేజ్ (తాకట్టు)

ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు సొంత ఇల్లు కొనాలని లేదా కట్టుకోవాలి అని కలలు కంటారు. మీరు, నేను ఇందుకు మినహాయింపు కాదు. మీరు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మీకు ఇల్లు అవసరం మరియు వీలైనంత త్వరగా తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. మీ అవసరాలు మిగితా వాళ్ళ అవసరాలకన్న వేరుగా ఉండచ్చు. కొందరు బిజీగా ఉండే ఏరియా లో ఫ్లాట్‌ని కలిగి ఉండటానికి ఇష్టపడవచ్చు, అయితే మీరు ఊరి చివర ప్రశాంతంగా ఇల్లు కలిగి ఉండాలని కలలు కనచ్చు. కాబట్టి కెరీర్ మరియు మీ అవసరానికి అనుగుణంగా తనఖాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి.

ఇన్వెస్ట్మెంట్ గోల్స్

ఇన్వెస్ట్మెంట్ అనేది మన డబ్బు విలువను నిర్ణిత గడువులోగా నిర్దిష్టమైన రిస్క్ తో చేసే పద్ధతి. మిగితవారిలాగే మీ దగ్గర డబ్బు పరిమితంగానే ఉండి ఉండవచ్చు. మీ గోల్స్ ని రీచ్ అవ్వటానికి అది పెరగాలి అని తెలుసుకోవాలి, అప్పుడే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మైండ్ లోకి వస్తుంది. అది గోల ఇన్వెస్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇలా ఏదైనా కావచ్చు. 

నాగరికత ప్రారంభమైనప్పటి నుండి, ఇన్వెస్టర్స్ తమ మోనేటరి వేల్యూను  గుణించడానికి కొత్త పెట్టుబడి అవకాశాలను కనుగొనే మార్గంలో ఎల్లప్పుడూ స్టాక్‌లు, బాండ్‌లు, రియల్-ఎస్టేట్, ఫారెక్స్, స్టార్ట్-అప్ మొదలైన పెట్టుబడి ఎంపికలతో నేటి ఫైనాన్షియల్ మార్కెట్ ఫీల్డ్‌ను కనుగొంటూ ఉంటారు.

చాలా మంది స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన స్థలం కాదని, ఖచ్చితమైనదిగా ఉండాలని భావిస్తారు, సరైన ప్రాథమిక, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషణతో మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపై గొప్ప రిటర్న్స్ పొందవచ్చు.

బిజినెస్లోలాగే, స్ట్రాటజిక్ పర్సనల్ ఫైనాన్స్ కూడా ప్రాధాన్యత, అసెస్మెంట్, మానిటరింగ్ మరియు భవిష్యత్తులో దాని సక్సెస్ ఫ్రూట్స్ ఆస్వాదించడానికి బలమైన సంకల్ప శక్తి అవసరం. మీరు దాని కోసం ఎంత అంకితభావంతో ఉంటే అంత ఎక్కువ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది.

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, Whatsapp లో జాయిన్ అవ్వండి.

Spread the love