How to Save Money on Personal Finance

సంపద సృష్టించాలి అంటే డబ్బు కావాలి అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే సంపన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు తప్ప వేరే ఎవరు ధనవంతులు అయ్యే అవకాశమే లేదు. ఎంతో మంది జీరో నుండి బిలియనీర్స్ అయినవాళ్ళు ఉన్నారు కదా!

Jan Koum WhatsApp కో ఫౌండర్, Kenny Trout ఎక్సెల్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ Flex-N-Gate ఓనర్ షహీద్ ఖాన్ ఇలా ఇంకా ఎంతో మంది బిలియనీర్స్ ఉన్నారు. 

డబ్బు సంపాదించడానికి మీకు ఏం కావాలి?

మనీ సేవ్ చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశం, మీ ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదా ఒక ఇన్వెస్టర్ గా మారాలి అనుకున్నా. ఈ రెండూ అత్యంత ముఖ్యమైన మార్గాల ద్వారా మీరు సక్సెస్ అవ్వగాలుగుతారు. లాటరి తగులుతుంది అనో లేదా ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది అనో ఎదురు చూడటం వృధా. 

ఆ అద్భుతమైన అవకాశాన్ని మనం చిన్న చిన్న అలవాట్ల ద్వారా మార్చుకోగలం. ఇది పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది. మిమ్మల్ని ధనవంతులుని చేయాలి అని ఎవరో వచ్చి మీ కోసం పని చేయరు కదా!

పర్సనల్ ఫైనాన్సు ద్వారా మనీ సేవ్ చేసుకుంటూ మీరు మీ కలలను నిజం చేసుకోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. 

ఈరోజు ఇక్కడ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. 

విదేశాల్లో పనిచేయడం గురించి ఆలోచించండి

విదేశాల్లో పనిచేయడం ద్వారా మనం త్వరగా డబ్బు సంపాదించవచ్చు. మన కరెన్సీలోని వేత్యాసం వాళ్ళ మనం ఇక్కడ సంపదిన్చేదానితో  దానితో పోలిస్తే మనం ఎన్నోరెట్లు ఎక్కువగా సంపాదించవచ్చు. అంతే కాకుండా మనం మన ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవచ్చు, అనవసర ఖర్చులు చేయకుండా! ఈ విధంగా కూడా మనం ఇంకొంత డబ్బు సేవ్ చేసే అవకాశం ఉంది. 

మనీ ట్రాన్స్ఫర్ చేయటానికి మంచి ఇంటర్నేషనల్ కంపెనీ యూస్ చేయండి.

ఒక మంచి ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ ద్వారా కూడా మనం డబ్బు ఆదా చేయవచ్చు. బెస్ట్ సర్వీస్, బెస్ట్ ఎక్స్చేంజి రేట్స్, లో సర్వీస్ చార్జెస్ లాంటి వాటి ద్వారా మనీ ట్రాన్స్ఫర్స్ పైన సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటె మనం బల్క అమౌంట్ సెండ్ చేసినప్పుడు చార్జెస్ కూడా అలాగే ఉంటాయి. వీటిని పరిగణలోకి తీసుకుని మనం ఒక మంచి కంపెనీ ని యూస్ చేస్తే ఇంకొంత ఆదా చేయవచ్చు.

మీ ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోండి.

పర్సనల్ ఫైనాన్సు ద్వారా మనీ సేవ్ చేయాలి అంటే మీరు మీ ఫైనాన్సెస్ ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. అవును నేను బడ్జెట్ గురించే మాట్లాడుతున్నాను. బడ్జెట్ ప్రిపేర్ చేయడం ద్వారా మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, వేటి కోసం ఖర్చు పెడుతున్నారు, అందులో అవసరమైన ఖర్చులు ఏంటి? అనవసరమైన ఖర్చులు ఏంటి అని తెలుసుకుని ఖర్చులు తగ్గించుకోవచ్చు. 

ఇందుకోసం ఎన్నో బడ్జెటింగ్ యాప్స్ ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయి. లేదంటే ఒక గూగుల్ షీట్ లేదా ఎక్సెల్ షీట్ ద్వారా కూడా బడ్జెట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను అయితే పర్సనల్ గా గూగుల్ షీట్స్ యూస్ చేస్తున్నాను. లేదా ఫైనాన్సు డైరీస్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని అయినా యూస్ చేయవచ్చు. 

కాబట్టి ఈరోజు నుండే మీ జమ ఖర్చులు లెక్కలు రాయడం మొదలు పెట్టండి. 

మీ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. 

మీరు కొంత మొత్తాన్ని సేవ్ చేస్తుంటే మీరు దాని వేల్యూ  షార్ట్ పీరియడ్ లో ఎలా ఇంక్రీస్ చేయాలి అని కూడా ఆలోచించాలి. మీరు అనుకోవచ్చు, అవును కరెక్ట్! కానీ దాన్ని ఎలా చేయాలి? అని

అందుకోసం మీరు ఏదైనా ఒకటి లేదా రెండు మంచి కోర్సులు షార్ట్ మనీ మేనేజ్మెంట్ గురించి చేయవచ్చు. దానివల్ల మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ ని లాంగ్ టర్మ్ లో సరిగ్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. సరైన చోట ప్రతి నేలా అం పొడుపు చేయటం వలన ఎలాంటి వాళ్ళు అయిన కూడా మిలియనీర్ కావచ్చు.

అంతే కాకుండా మనీ మేనేజ్మెంట్ కోర్సులు మన ఫైనాన్షియల్ హాబిట్స్ ని కూడా చేంజ్ చేస్తాయి. దాని వలన మీరు మీ ఖర్చులను తగ్గించుకుని కింక ఎక్కువ డబ్బు సేవ్ చేయవచ్చు. 

క్రెడిట్ స్కోర్ ని ట్రాక్ చేసుకుంటూ ఉండండి. 

మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం వలన మనకి త్వరగా లోన్స్ రావడానికి అవకాశం ఉంది. లోన్ త్వరగా తెచ్చుకోవచ్చు. అదే విధంగా దాన్ని సరిగ్గా క్లియర్ చేస్తే మన క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. అలాగని దొరికిన ప్రతి చోటా లోన్స్ తీసుకుంటే మల్టిపుల్ క్రెడిట్ లైన్స్, క్రెడిట్ స్కోర్ ని ఎఫెక్ట్ చేస్తాయి. 

అంతే కాకుండా మన పేరు పైన ఏవైనా ఫ్రాడ్ లోన్స్ లాంటివి ఉన్నాయా అని చూసుకోవడం కూడా ముఖ్యమే. అంతే కాకుండా లేట్ పేమెంట్స్, పేమెంట్ మిస్ చేయడం లాంటివి క్రెడిట్ స్కోర్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అలా కాకుండా ఉండాలి అంటే మీరు మీకు ఎంత అవసరమో, ఏది అవసరమో అటువంటి వాటిని మాత్రమే క్రెడిట్ లేదా లోన్ లో తీసుకోండి. మిగిలిన వాటికీ దూరంగా ఉండండి. 

ఇన్వెస్టింగ్ vs సేవింగ్స్

మీ సేవింగ్స్ బ్యాంకు ఎకౌంటు లో డబ్బు ఉండటం మంచి విషయం ఇంకా సురక్షితం కూడా. కానీ మీరు మీ డబ్బును బ్యాంకు సేవింగ్స్ ఎకౌంటు లో ఉండటం వలన మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, అదే విధంగా ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం వలన ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అని చెక్ చేస్యుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనం బ్యాంకు రిటర్న్స్ కన్నా ఎక్కువ శాతం లాభాన్ని పొందవచ్చు. (బ్యాంకు రిటర్న్స్ తో పోలిస్తే!) 

ఇక్కడ చెప్పబోయే కొన్ని మనీ సేవింగ్ మెథడ్స్ మీరు ఒక మిలియనీర్ కావడానికి, మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి హెల్ప్ అవ్వచ్చు. 

ఫైనాన్షియల్ గోల్స్ ని ప్లాన్ చేసుకోండి. 

మీరు మీ గోల్స్ ని వివిధ టైం ఫ్రేమ్స్ లో డివైడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్, ఇంటర్మీడియట్ టర్మ్, లాంగ్ టర్మ్, రిటైర్మెంట్ ఇలా. స్పష్టమైన అవగాహనా లేకపోతే మన ప్రయత్నాలు అన్ని బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. 

మీ గోల్స్ ని రీచ్ అవ్వదనికి మీరు బాగా కష్ట పడండి. మెల్లిగా ఒక్కో గోల్ ని రీచ్ అవ్వండి. ఉదాహరణకి అప్పులు తీర్చడం, (లోన్స్ కూడా అప్పులే కదా!) సొంత ఇల్లు, కారు, పిల్లల చదువులు, పెళ్లిలు ఇలా మనం ప్లాన్ చేసుకోగలిగితే మన ఆర్ధిక లక్ష్యాలు చేరుకోవడానికి మనకి సులభంగా ఉంటుంది. 

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Spread the love