Personal Finance Vs Business Finance in Telugu

పర్సనల్ ఫైనాన్స్ ని అర్థం చేసుకోవడం

పర్సనల్ ఫైనాన్స్ అనేది మీ ఫైనాన్షియల్ డెస్టినీని తప్పనిసరుగా నియంత్రిస్తుంది. పర్సనల్ ఫైనాన్స్ అనేది మీ ఇన్కమ్, ఖర్చులు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, అప్పులు మొదలైనవంటి వాటి గురించి. 

మీ పెర్సినల్ ఫైనాన్సును సరైన మార్గంలో నిర్వహించడం ద్వారా, మీరు భవిష్యత్తులో మీ ఆర్థిక శ్రేయస్సును సురక్షితంగా ఉంచడంలో సహాయపడే మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు.  

పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో ఏముంటాయి? 

సింపుల్ గా చెప్పాలి అంటే, పర్సనల్ ఫైనాన్స్ అంతా కూడా బడ్జెటింగ్ చుట్టూ తిరుగుతుంది. ఇది మీ ఆదాయాన్ని, వివిధ ఖర్చులను, సేవింగ్ గోల్స్, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంత మొత్తం కేటాయించగలం అని వివరణాత్మకంగా ఆర్ధిక ప్రణాళికను (ఫైనాన్షియల్ ప్లాన్)  రూపొందిస్తుంది. 

మీరు మీ ఖర్చులను, అదే విధంగా వాటిని తగ్గించుకోవడానికి మరియు ఆర్ధిక స్థిరత్వాన్ని పొందటానికి కావాల్సిన సర్దుబాట్లు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ సేవింగ్స్ మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో భాగం.

మీ ఆదాయంలో కొంత మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం కోసం ఉపయోగించాలి, అదే విధంగా మీ షార్ట్ టర్మ్ గోల్స్ ని రీచ్ అవ్వడం కోసం, ఫ్యూచర్ లో  ఫైనాన్షియల్ మైల్ స్టోన్స్ అందుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. 

ఉదాహరణకి, ఫ్యూచర్ లో ఒక మంచి ప్రాపర్టీ కొనాలి అనుకున్నా, లేదా మీ రిటైర్మెంట్ కోసం లేదా మీ జీవితాంతం మీకు సపోర్ట్ ఇవ్వడం కోసం తగినంత సేవింగ్స్ ఉండాలి. అంతేకాకుండా, స్టాక్‌లు, బాండ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు మరియు మరిన్నింటి వంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ద్వారా ఈ సేవింగ్స్ మరింత పెంచుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కాలక్రమేణా మీ సంపదను గణనీయంగా పెంచుతాయి.

అదేవిధంగా, లోన్స్ మైంటైన్ చేయడం  కూడా వ్యక్తిగత ఫైనాన్స్‌లో మరొక కీలకమైన అంశం. వడ్డీ రేట్లు, రీపేమెంట్ షెడ్యూల్‌లు మరియు అప్పు-ఇన్కమ్ రేషియో ఇంపాక్ట్ మీరు అర్థం చేసుకోవడానికి మీరు ఎంత లోన్ తీసుకున్నారో మరియు ఎప్పుడు తీసుకున్నారో మీరు గుర్తుంచుకోవాలి.

మీరు బిజినెస్ లోన్, హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం అప్లై చేసినా, మీ అప్పులను మేనేజ్ చేయడం వల్ల భవిష్యత్తులో అధిక ఆర్థిక భారాలను నివారించవచ్చు.

మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలను అర్థం చేసుకోవడం, ఇంకా ఎక్స్పర్ట్ అవ్వడం ద్వారా, మీరు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు మీ ఫ్యూచర్ కోసం బలమైన పునాదిని నిర్మించుకోవచ్చు.

బిజినెస్ ఫైనాన్స్ ని అర్థం చేసుకోవడం

బిజినెస్ ల్యాండ్‌స్కేప్‌ను రీసెర్చ్ చేయడానికి, ఆర్థిక మరియు మార్కెట్-సంబంధిత డేటాను విశ్లేషించడానికి రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడంలో అవుట్‌సోర్సింగ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ మీకు హెల్ప్ అవుతుంది.

దీని వలన ఫైనాన్షియల్ మోడలింగ్, DFC ఎనాలిసిస్, IPO ఎనాలిసిస్, క్రెడిట్ రీసెర్చ్, టెక్నికల్ ఎనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ ని ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 

వ్యాపారం విషయానికి వస్తే, సమర్థవంతమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విజయానికి మూలస్తంభం అని చెప్పవచ్చు. మీ బిజినెస్ ఫైనాన్స్ మీ వ్యాపారం యొక్క లాభదాయకతతో ముడిపడి ఉంది.

కొన్ని కీలక సూత్రాలు మరియు ప్రాక్టిస్లను అనుసరించడం ద్వారా, మీరు బిజినెస్ ని బూస్ట్ చేసే విషయంలో సహాయపడే వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు. 

బిజినెస్ ఫైనాన్స్ లో ఏం ఉన్నాయి? 

ఇతర విషయాలతోపాటు, మీ వ్యాపార ఫైనాన్షియల్ రిసోర్సెస్, సమర్ధవంతమైన రిసోర్సెస్ యుటిలైజేషన్, ప్రాఫిటబులిటిని పెంచడం మరియు లాంగ్ టర్మ్  గ్రోత్ ని సాధించడం కోసం ఉద్దేశించిన అన్ని ఫైనాన్షియల్ ఆక్టివిటీస్ ఉంటాయి. 

మీ బిజినెస్ ఫైనాన్స్‌లో ఎక్కువ భాగం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది, ఇది ఫైనాన్షియల్ రిసోర్సెస్ ను అలాట్ చేయటానికి, గోల్స్ డిఫైన్ చేయడానికి మరియు డెవలప్మెంట్స్ పర్యవేక్షించడానికి, సమగ్ర వ్యూహాలను అభివృద్ధి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 

కాపిటల్ స్ట్రక్చర్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్ లో ముఖ్యమైనది. వ్యాపార కార్యకలాపాలు, విస్తరణ ప్రణాళికలు మరియు పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి మొత్తం డెట్ మరియు ఈక్విటీ ఫైనాన్సింగ్‌ను బ్యాలెన్స్ చేయడం ఇందులో ఉంటుంది.

సరైన కాపిటల్ స్ట్రక్చర్,  రిస్క్ మరియు రిటర్న్ మధ్య సమతుల్యతను సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొనసాగిస్తూనే, మీకు అవసరమైన బిజినెస్ ఫండ్స్  లభ్యత  ఉందని ఇది మరింత నిర్ధారిస్తుంది.

అదేవిధంగా, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మరియు డెసిషన్ మేకింగ్ బిజినెస్ ఫైనాన్స్‌లో మరో ముఖ్యమైన భాగం. మీ బిజినెస్ గోల్స్ కి అనుగుణంగా మీరు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను ఎనలైజ్ చేయవలసి ఉంటుంది.

అంతే కాకుండా బిజినెస్ ఫైనాన్స్ లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎనాలిసిస్ ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ లను కలిగి ఉంటాయి. మీ బిజినెస్ నిజంగా ఎలా పని చేస్తుందో సమగ్ర వీక్షణను అందించడానికి మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ సిద్ధం చేయాల్సి రావచ్చు.

మీరు మార్కెట్ అస్థిరత, క్రెడిట్ రిస్క్‌లు, ఆపరేషనల్ రిస్క్‌లు మరియు మరిన్ని వంటి రిస్క్‌లను కూడా మేనేజ్ చేయవలసి ఉంటుంది. 

పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ ఫైనాన్సు ను వేరు చేయడం యొక్క ప్రాముఖ్యత

చాలా మంది పర్సనల్ ఫైనాన్సు, బిజినెస్ ఫైనాన్సు కలపకూదడా అని అడుగుతూ ఉంటారు. అయితే ఇందువల్ల మంచి కన్నా, ఎక్కువగా హాని జరిగే అవకాశం ఉంది. బిజినెస్ ఫైనాన్స్ ని, పర్సనల్ ఫైనాన్స్ ని విడి విడిగా మైంటైన్ చేయడం అవసరం. లీగల్ & ఫైనాన్షియల్ లైబిలిటి అనేవి ముఖ్యమైన కారణాలలో ముఖ్యమైనవి. 

పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ ఫైనాన్స్ వేరు వేరుగా మైంటైన్ చేయడం ద్వారా మీ వ్యక్తిగత ఆస్తులను వ్యాపారా సంబంధిత అప్పులు, చట్టపరమైన చుక్కుల నుండి రక్షించుకోవచ్చు. ఇది వ్యక్తిగత ఆస్తులు రక్షింపబడేలా మరియు వ్యాపార బాధ్యతలు మీ వ్యాపారంలో మాత్రమే ఉండేలా నిర్ధారిస్తుంది. 

అంతేకాకుండా, మీ ఆర్థిక విషయాలను వేరు చేయడం వలన మీరు ఖచ్చితమైన ఫైనాన్షియల్ రికార్డ్స్ మైంటైన్ చేయడం మరియు రిపోర్టింగ్‌ను సులభతరం చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది.

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.

Spread the love