ఒక కొత్త బిజినెస్ ని స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. అప్పటికే ఎన్నో కంపెనీలు ఎప్పటి నుండో మార్కెట్ ల్ ఉండి ఉంటాయి. మీరు మీ బిజినెస్ బ్రాండ్ కోసం, సక్సెస్ చేయడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది నేను చెప్పినంత ఈజీ కాదు, నాకు కూడా ఆ విషయం తెలుసు!
ఒకవేళ మీకు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని ప్యాషన్ ఉంటె దానిని ఎందుకు ఒక ప్రొఫెషన్ గా తీసుకోకూడదు?
అయితే, మీరు చిన్న బిజినెస్ నడుపుతున్నా లేదా పెద్ద కంపెనీని స్థాపించినా, సక్సెస్ ఎల్లప్పుడూ ప్లానింగ్ తో కూడిన స్ట్రాటజీతోనే వస్తుంది.
కాబట్టి, మీరు ఒక డీటెయిల్ ప్లానింగ్ ను రూపొందించారా లేదా అనేది పట్టింపు లేదు. మీ వ్యాపారం యొక్క విజయం చుట్టూ తిరిగే ప్రాథమిక ముఖ్యమైన భాగాలను కవర్ చేయడం ముఖ్యం.
ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మొదటి అడుగు ప్రణాళిక అని డెడికేటెడ్ ఎంటర్ప్రేన్యూర్లకు తెలుసు. అయితే మీరు ఇలా ఆలోచిస్తున్నారా?
“నేను నా ఫినన్సులు ఎలా ప్లాన్ చేసుకోవాలి?”
అవునా! అక్కడికే వస్తున్నా. ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేయాలి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? టాక్స్ పేమెంట్స్ ఇలా మీరు ఎన్నో ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈరోజు నేను వాటిల్లో కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతే కాకుండా స్టార్ట్ అప్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టర్స్ ఏమేం పరిగణలోకి తీసుకుంటారు అని తెలుసుకుందాం.
చిన్న వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటి ఫైనాన్స్ మేనేజ్మెంట్. ఇది మీరు లాభాలను ఎలా ఆర్జించాలో మరియు విజయానికి ఎలాంటి పెట్టుబడులు అవసరమో నిర్ణయించడంలో సహాయపడుతుంది. అలాగే, టాక్సుల గురించి అకౌంటెంట్‌తో తప్పకుండా మాట్లాడండి!
కాబట్టి, మీ వ్యాపారం యొక్క ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడంలో మీకు సహాయపడే కొన్ని సులభమైన ప్రాక్టికల్ టిప్స్ గురించి మాట్లాడుకుందామా!
Small Business Finance Management Tips
1. బడ్జెట్ ను సెట్ అప్ చేసుకోండి
మీపైన మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి మొదటి మార్గం బడ్జెట్ బిల్డింగ్. మీకు బాగా తెలిస్తేనే దేనిలోనైన ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటేనే మీరు కాన్ఫిడెంట్ గా ఇన్వెస్ట్ చేయగలుగుతారు.
ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో బడ్జెట్ సెటప్ చాలా ముఖ్యమైనది. మీరు మీకు వచ్చే అన్ని ఇన్కమ్ సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ని ఒక లిస్టు చేయండి. అదే విధంగా మీకు అయ్యటువంటి ఖర్చులను కూడా.
ఇప్పుడు వాటిని ఎక్కువ అమౌంట్ నుండి తక్కువ అమౌంట్ వచ్చేలా ఆర్డర్ సెట్ చేయండి. దీని వలన మీకు కష్టమైనా ఖర్చులు ఏం ఉన్నాయో, వాటిని ఎలా చెల్లించాలి అని అర్థం చేసుకోవడం లో సహాయపడుతుంది.
మీరు బడ్జెటింగ్ బేసిక్స్ కోసం ఏవైనా ఆన్లైన్ కోర్సెస్ లో ఎన్రోల్ అవవచ్చు. బడ్జెట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎటువంటి టూల్స్ ఉపయోగించాలి, మీ గోల్స్ ని ఎలా అచివ్ చేయాలి, మీ బడ్జెట్ కి ఎలా స్టిక్ అయి ఉండాలి అని ఈ కోర్సెస్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి బడ్జెటింగ్ పైన ఫోకస్ చేయండి.
2. ఎమర్జెన్సీ కోసం కొంత సేవ్ చేయండి
బిజినెస్ స్లోగా ఉన్నపుడు లేదా ఎటువంటి లాభాలను జెనరేట్ చేయలేని పరిస్థితిలో ఎంటర్ప్రేన్యూర్ కి బ్యాక్ అప్ ప్లాన్స్ ఖచ్చితంగా ఉండాలి. బిజినెస్ లో అయినా నష్టం అనేది ఏ బిజినెస్ ఓనర్ కి అయినన పీడకల లాంటిదే.
మీ పీడకల రియాలిటీగా మారితే?
మీరు దాని ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నారా మరియు తగినంత బ్యాకప్ కలిగి ఉన్నారా?
అందువల్ల, అటువంటి భయానక పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫండ్ మీకు హెల్ప్ అవుతుంది. మీ నెలవారీ వ్యక్తిగత మరియు వ్యాపార ఖర్చులను క్యాలుక్లేట్ చేయడం ద్వారా ప్రారంభించి, ఆపై వాటిని 6తో గుణించండి. ఈ విధంగా, మీరు ఊహించని పరిస్థితుల కోసం కనీసం ఆరు నెలల బ్యాకప్‌ను కలిగి ఉంటారు.
మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితిలో ఉంటే, మీరు ఎమర్జెన్సీ ఫండ్ నుండి త్వరగా డబ్బును డ్రా చేసుకోవచ్చు. మళ్ళి మీరు ఆ అమౌంట్ ని తిరిగి ఫిల్ చేసేలా చూసుకోండి.
3. ఒక అకౌంటెంట్ ని పెట్టుకోండి.
ఎంటర్ప్రేన్యూర్స్ ఎప్పుడూ అకౌంటెంట్లు కాదు. అంతే కాకుండా మీకు అకౌంటెన్సీ అనుభవం ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మొదట్లో ఎంటర్ప్రేన్యూర్స్ తమ బిజినెస్ యొక్క ఆర్థిక వ్యవహారాలను వారి స్వంతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తారు.
వారు పుస్తకాల నుండి ఫైల్‌లు, టాక్స్లు మొదలైనవాటిని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం వలన చివరికి వారికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
అందువల్ల, ప్రొఫెషనల్ అకౌంటెంట్‌ను నియమించుకోవడం మంచిది. అకౌంటెంట్‌ని నియమించుకోవడం మీ తలనొప్పిని దూరం చేస్తుంది మరియు కొంత డబ్బు ఆదా చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది.
తగ్గింపులు మరియు పన్ను ఆదాలను తగ్గించగల మార్గాలను కనుగొనడంలో అవి మీకు సహాయపడతాయి. ఈ విధంగా, మీరు పెనాల్టీ రహితంగా ఉంటారు మరియు ఏదైనా అడ్డంకుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు.
4. టాక్సుల కోసం కొంత డబ్బు పక్కన పెట్టండి.
టాక్స్ పేమెంట్ ప్రాసెస్ చాలా సున్నితమైనది, చిన్న రసీదుని కోల్పోవడం కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. కాబట్టి ఎవరూ పన్నులు చెల్లించడానికి ఇష్టపడరు, కానీ విచారకరమైన రియాలిటీ ఏంటి అంటే మనం దానిని తప్పించుకోలేము.
ప్రభుత్వం ఎప్పటికీ క్షమించదు. మీరు వ్యాపారాన్ని కలిగి ఉన్నప్పుడు మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని మీరు వారికి చెల్లించాలి. అయితే, మీ లొకేషన్ మరియు మీ బిజినెస్ పరిధిని బట్టి మీ టాక్స్ రేట్లు భిన్నంగా ఉంటాయి.
కాబట్టి మీ డ్యూ టాక్స్ పేమెంట్స్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి మరియు వీలైనంత త్వరగా వాటిని చెల్లించడానికి ప్రయత్నించండి, ఇది మిమ్మల్ని అసహ్యకరమైన ఆశ్చర్యాల నుండి కాపాడుతుంది.
5. పర్సనల్, బిజినెస్ అకౌంట్స్ వేరు వేరు గా ఉంచండి.
మీరు మీ పర్సనల్ అకౌంట్స్ ఇంకా బిజినెస్ అకౌంట్స్ వేరు వేరుగా మైంటైన్ చేయండి. లేదంటే అంతా గందరగోళంగా ఉంటుంది. అంతే కాకుండా టాక్స్ పేమెంట్స్ అప్పుడు అనవసరంగా టాక్స్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది.
రెండు అకౌంట్స్ వేరుగా ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు సంపాదించిన లాభం మరియు ఖర్చు చేసిన డబ్బును ట్రాక్ చేయవచ్చు. మీరు అనుకోకుండా మీ బిజినెస్ ఖాతా నుండి నగదును ఉపయోగించరు మరియు దానిని పర్సనల్ ఇంట్రెస్ట్స్ కి ఖర్చు చేయరు.
అత్యంత కీలకమైన ప్రయోజనం, పన్ను చెల్లింపుల సమయంలో, మీరు మీ బిజినెస్ ఖర్చులకు మాత్రమే మినహాయింపును సులభంగా క్లెయిమ్ చేయవచ్చు.
అందువల్ల, మీరు చిన్న వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే, రెండు అకౌంట్స్ విడివిడిగా ఉంచడం వలన మీరు ఆర్థిక వ్యవహారాలను సులభంగా నిర్వహించవచ్చు.
6. ఆర్గనైజడ్ గా ఉండండి
ఆర్గనైజడ్ గా ఉండటం వలన ఎంతో ప్రశాంతంగా ఎంతో సులభంగా ఫైనాన్షియల్ మేటర్స్ డీల్ చేయగలుగుతాము. వారానికి ఒకసారి లేదా కనీసం నెలకి ఒకసారి అకౌంట్స్ చెక్ చేయడం మంచిది. లేకపోతే అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక సిస్టం ని మనం బిల్డ్ చేయవలసి ఉంటుంది. అంతవరకూ మనం అలెర్ట్ గా ఉండాలి.
ఇక చివరగా, చిన్నదైనా పెద్దదైనా వ్యాపారాన్ని నడపడం సవాలుతో కూడుకున్నదే. ఇది ఇంట్రెస్ట్, డెడికేషన్ మరియు ఫోకస్ తో కూడుకున్నది. అయితే, పైన చెప్పిన టిప్స్ తో మీరు సులభంగా మీ వ్యాపార ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, Whatsapp లో జాయిన్ అవ్వండి.