Smart Tips for Savings Plan in Telugu

ఆర్ధిక స్వాతంత్ర్యం (ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్) సాధించాలి అంటే మనీ సేవింగ్ అత్యంత ముఖ్యమైనది. బెటర్ లైఫ్ లీడ్ చేయటానికి ఇది మొదటి అడుగు. అయినప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయంతో, మనలో చాలా మందికి సేవింగ్స్ అనేది ఒక కలగా అనిపించవచ్చు.

ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో గృహ ద్రవ్యోల్బణం చాలా మందికి డబ్బు సేవ్ చేయడం చాలా కష్టతరం చేసింది. అదేవిధంగా, న్యూజిలాండ్‌లో ఖర్చు చేసే అలవాట్ల వల్ల చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే 40% కివీస్ పొదుపులో $1000 కంటే తక్కువ కలిగి ఉన్నారు, ఇది వారు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలియ చేస్తుంది.

ఎంజాయ్మెంట్ చేయకుండా వల్ల ఆదా చేయడంలో సక్సెస్ కాలేరు. అయితే, మీ లైఫ్ స్టైల్ లో చిన్నచేంజ్, లేదా ఎఫెక్టివ్ చేంజ్స్ చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం, బడ్జెట్ యాప్‌కి సైన్ అప్ చేయడం మరియు మీ ఖర్చులను ట్రాక్ చేయడం వంటివి మిమ్మల్ని మెగా సేవింగ్స్  చేయడం వైపు నడిపిస్తాయి.

ఫైనాన్షియల్ గా సెక్యూర్ గా ఉండటం కోసం బెస్ట్ వే అల్టిమేట్ గా డబ్బు సంపాదించడం, ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం మళ్ళి రిపీట్ చేయడం.

డబ్బు సేవ్ చేయడానికి ప్రతి ఒక్కరికి కొన్ని డిఫరెంట్ ప్లాన్స్, స్టైల్స్ ఉంటాయి. అలాగని సింపుల్ వేస్ తెలుసుకోకుండా ఉండకూడదు కదా! 

మీ సేవింగ్స్ పెంచడానికి మరియు మీ షార్ట్ టర్మ్ & లాంగ్ టర్మ్ గోల్స్ చేరుకోవడంలో మీకు సహాయపడటానికి నేను ఈరోజు కొన్ని టిప్స్ చెప్తాను. నచ్చితే ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా హ్యాపీగా ఉంటె మనకి అంత కన్నా కావాల్సింది ఏముంది?

1. స్మార్ట్ గా లోన్ (ఋణం) క్లియరెన్స్ చేయండి

అప్పు తీర్చడం అనేది మనం సేవింగ్స్ చేయడానికి ఒక పెద్ద అడ్డంకి. ఒకవేళ మీకు మరిన్ని అప్పులు లేదా లోన్స్ ఉన్నట్లు అయితే ట్రాక్ చేయడం కష్టం అయిపోతుంది. వీలియినంత త్వరగా వాటిని వదిలించుకోవడమే ఫైనాన్షియల్ గ్రోత్ కి ఫాస్ట్ దారి. 

ముందుగా మీరు మీ లోన్స్ మొత్తం ఒక లిస్టు చేయండి. అందులో ముందుగా చిన్న చిన్నవి మొత్తం తీర్చేయండి. ఇలా చేయడం వలన మనకి చిన్న చిన్న లోన్స్ అన్ని తీరిపోతాయి. దాని వల్ల మనకి కొన్ని అప్పులు తీరిన తృప్తి కలుగుతుంది, అంతే కాకుండా ఇన్ని లోన్స్ ఉన్నాయి అనే మీ మనసుకి కొన్ని తీరిపోయాయి అనే మానసిక తృప్తి కూడా ఉంటుంది. 

తరువాత ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సిన వాటిని క్లియర్ చేయండి. దిని వలన మనం కట్టవలసిన ఇంటరెస్ట్ (వడ్డీ) ని మనం ఆడ చేయవచ్చు. ఈ ప్రాసెస్ లో మనం సేవ్ చేయడం కుదరదు. కానీ ఎంతో కొంత సేవ్ చేయడానికి ట్రై చేయండి. కనీసం నెలకి ఒక వెయ్యి రూపాయలతో మొదలుపెట్టండి. 

2. మీ ఖర్చులను ట్రాక్ చేయండి

మన స్నేహితుడు ఎవరో తెలిస్తే మనం ఎలాంటి వాళ్ళం అని చెప్పవచ్చు అని అంటూ ఉంటారు. అదే విధంగా మీ ఖర్చులు గురించి మీకు తెలిస్తే మీరు సేవింగ్స్ ఇంకొంచెం ఎక్కువ ఎలా చేయవచ్చు అని తెలుసుకోవచ్చు.

కొంతమంది రెగ్యులర్ గా వాళ్ళకి అవసరం లేని వస్తువులపై డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు. దీని వలన వృధాగా డబ్బు ఖర్చు అవుతుంది, లేదా అసలు ఇక ఏమి మిగల కుండా కూడా మొత్తం ఖర్చయిపోతుంది. 

ఒక నెల రోజుల పటు మీరు ఖర్చు పెట్టె ప్రతి రూపాయిని నోట్ చేయండి. దాదాపుగా మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నో బడ్జెట్ యాప్స్ దొరుకుతాయి. అవి యూస్ చేయండి. ఇలా చేయడం వలన మీరు దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అని మీకు బాగా అర్థం అవుతుంది. 

ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు డైలీ బస్సు లో లేదా మెట్రో లో వెళ్తున్నారు అనుకుందాం. ప్రతి రోజు టికెట్ తీసుకోవడం కన్నా మంత్లీ పాస్ తీసుకోవడం వలన మనకి లాభం కదా! ఇలా మనం ఎక్కడ ఖర్చులు తగ్గించుకోగాలమో నోట్ చేయడం వల్ల మాత్రమే తెలుసుకోగలం.

3. మీ గోల్స్ డిఫైన్ చేయండి, వాటిని అనలైజ్ చేయండి

షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ డిఫైన్ చేసుకోవడం అనేది మనీ సేవ్ చేయడానికి ఎఫిషియంట్ స్ట్రాటజీ. మీ మనీ సేవింగ్ గోల్స్ సెట్ చేసుకోవడం వలన మీ కాన్సంట్రేషన్ టార్గెట్ పైన ఉంటుంది. వాటిని ఎలా అచివ్ చేయాలి అని మనం మార్గం అన్వేషిన్చడానికి సహాయపడుతుంది. 

ప్రతి సేవింగ్స్ స్ట్రాటజీ బడ్జెట్ తోనే స్టార్ట్ అవుతుంది. సహజంగా మనం ఏ పని చేయాలనుకున్న దీని వలన ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనకి మిగులుతుంది అని లెక్క వేస్తాం కదా! ఇది కూడా అంతే కాకపోతే ప్రతిది లెక్క వేస్తాం. బడ్జెట్ లో మనం మన కోరికల కంటే మన అవసరాలకి, గోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం. 

అంతే కాకుండా మన ఆదాయానికి, ఖర్చులకి మధ్య బాలన్స్ గా ఉండటానికి బడ్జెట్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ని పరిగణలోకి తీసుకుని మన ఖర్చులు, సేవింగ్స్ అనేవి అదుపులో ఉంటాయి. 

4. ముఖ్యమైన ఖర్చులపై ఫోకస్ చేయండి. 

ప్రతీ రూపాయి విలువైనదే. మీ సేవింగ్స్ పెంచుకోవాలి అంటే మీ ప్రధానమైన ఖర్చులు (కనీస అవసరాలు) మీకు కొంత సహాయం చేయవచ్చు. సాదారణంగా ఇందులో ఇంటి రెంట్, ట్రావెలింగ్, కిరాణా సరకులు, మందులు ఇలాంటివి ఉంటాయి. మనం కొంచెం స్మార్ట్ గా ఉంటె వీటి నుండి కూడా మనం కొంత ఆదా చేయవచ్చు. 

కిరాణా సరకులు ఎక్కడ తక్కువ రేట్స్ కి మంచి నాణ్యతతో లభిస్తాయి?

మందులకి ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ దొరుకుతుంది?

ట్రావెలింగ్ కి ఇంకా తక్కువగా మనం ఎలా ఖర్చు చేయవచ్చు లేదా పెట్రోల్ ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చు? 

ఒకవేళ మీకు అవసరం లేకపోతే ఏదైనా సర్వీస్ మినిమం ప్యాకేజ్ ఉంటుందా లేదా? 

ఈ విధమైన ప్రశ్నలకి సమాధానాలు మీరు కనుక్కుంటే ఆదా చేయడానికి ఇంకొంత డబ్బు రెడీ అయినట్లే. 

5. గోల్స్, ప్రయారిటీస్ సెట్ చేసుకోండి. 

మీ ఇన్కమ్, ఖర్చులు అనలైజ్ చేసి గోల్స్ సెట్ చేసుకున్నాక వాటికి ప్రయారిటీ ఇవ్వడం కూడా ముఖ్యమే. మీకు లాప్టాప్ కావాలి, అదే విధంగా బైక్ కావాలి అనుకుందాం.

ఒకవేళ మీ దగ్గర రెండింటికి సరిపడా డబ్బు లేదు అనుకుంటే ముందుగా మీరు లాప్టాప్ తీసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటె బైక్ లేకపోయినా వేరే మార్గం ఉంటుంది. కానీ లాప్టాప్ అనేది ఖచ్చితంగా వర్క్ చేసుకోవడానికి అవసరం. 

మీ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఎప్పుడూ లాంగ్ టర్మ్ గోల్స్ ని బ్రేక్ చేయవద్దు. కాబట్టి మీ గోల్స్ కి ఏది ముందు, ఏది తరువాత అనే ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకుంటే మీకు మరిన్ని గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సిన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. 

6. సేవర్ గా ఉండండి, పిసినారి గా కాదు. 

మీరు మనీ సేవ్ చేయటానికి మీకు ఇష్టం అయిన వాటిని వదిలివేయాలి అని కాదు. మీకు నచ్చిన ఫుడ్ ట్రై చేయండి. నచ్చిన మూవీ చూడండి. అయితే ఒక లిమిట్ పెట్టుకోండి. ప్రతివారం రెస్టారెంట్లకి, సినిమాలకి  వెళ్ళాల్సిన అవసరం లేదు. నెలకి ఒకసారి రెస్టారెంట్ కి, ఒకసారి సినిమాకి వెళ్ళవచ్చు. మనం చిన్న చిన్న ఆనందాలకి దూరం కాకూడదు. 

ఎందుకంటె వీటి వలన మనం తిరిగి ఉత్సాహంగా ఇంకా ఎక్కువ పని చేయడానికి, ఇంకొంత డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. డబ్బు సేవ్  చేయడం యొక్క లక్ష్యం స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవడం, అంతే కానీ ప్రెసెంట్ లో మనం పిసినరులుగా బతకమని కాదు. 

ముగింపు: 

మీరు మీ స్పెండింగ్ హాబిట్స్, మీ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటేనే మనీ సేవ్ చేయగలరు. కాబట్టి ఇందులో నేను చెప్పిన టిప్స్ పాటించడం మొదలు పెట్టవచ్చు. మీ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ గురించి తెలుసుకోండి. వాటివాటిని వాటిని రీచ్ అవ్వడానికి మీకు ఎంత డబ్బు కావాలి, ఎంత టైం పడుతుంది అని తెలుసుకోవాల్. ఒకవేళ అవసరం అయితే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోండి. 

ఒకవేళ మీరు సేవింగ్స్ చేస్తుంటే నేను చెప్పిన టిప్స్ లో ఏది బాగా పని చేస్తుందో చెప్పండి. ఒకవేళ మీరు పాటించే వాటిల్లో నేను చెప్పినవి లేకపోతే వాటిని మాతో పంచుకోండి. ఇంకొంత మందికి హెల్ప్ అవుతాయి. 

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.

Spread the love