హాయ్! ఈరోజు మనం బడ్జెటింగ్ గురించిన విషయాలు తెలుసుకుందాం. అసలు బడ్జెట్ అంటే ఏంటి? దానిని ఎలా క్రియేట్ చేయాలి? మీ ఫైనాన్షియల్ వెల్నెస్ కి బడ్జెటింగ్ ఎందుకు ఒక గేమ్ చేంజర్ అని తెలుసుకుందాం. ఇందుకోసం ఎటువంటి ఫైనాన్స్ డిగ్రీ అవసరం లేదు. మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం ఈ బ్లాగ్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. కాబట్టి మా బ్లాగ్ ని షేర్ చేయవచ్చు కదా!
Table of Contents
బడ్జెట్ అంటే ఏంటి? What is Budget in Telugu
డెఫినిషన్
సింపుల్ గా చెప్పాలి అంటే బడ్జెట్ అనేది మీ డబ్బుకు GPS లాంటిది. మీ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచించడం కంటే ఎక్కడికి వెళ్లాలో చెప్పడం ద్వారా మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడంలో మీకు సహాయపడే ప్లాన్ ఇది.
ఆదాయం vs ఖర్చులు
బడ్జెట్ మీరు కోరుకున్న ఆదాయం, అదే విధంగా ప్రతి రూపాయి ఏ విధంగా పని చేయాలి, మీ గోల్స్ కి అనుగుణంగా ఎంత సేవ్ చేయాలి, మిగిలిన వాటిని ఎంజాయ్ చేయటనికి ఉపయోగించాలి అని తెలియచేస్తుంది.
బడ్జెట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? How to Create Budget?
మీ ఆదాయాన్ని ట్రాక్ చేయండి
మీ అన్ని ఇన్కమ్ సోర్సెస్ ను లిస్టు చేయండి. మీ శాలరీ కావచ్చు, పార్ట్ టైం ఇన్కమ్ కావచ్చు, సైడ్ హజిల్ కావచ్చు ఇలా ఏదైనా మీకు ఒక రూపాయి వస్తుంది అంటే దానిని నోట్ చేయండి.
మీ ఖర్చులను లిస్టు చేయండి
మీ ఖర్చులను కేటగిరీలుగా విభజించండి – అద్దె లేదా తాకట్టు, లోన్స్, ట్రావెలింగ్, కిరాణా సామాగ్రి, యుటిలిటీస్, వినోదం మొదలైనవి. ప్రతి రూపాయి మీరు నోట్ చేయడం మర్చిపోవద్దు.
అవసరాలు vs కోరికలు మధ్య తేడా
అత్యవసరాలు (అవసరం), అదే విధంగా అనవసరమైన (కోరికలు) వాటి మధ్య తేడా గుర్తించండి. మీ ఇంటి అద్దె అవసరం, సరదాగా కాల్చే సిగరెట్ కోరిక కావచ్చు. ఈ స్టేజి మీ అవసరమైన్ ఖర్చులకు ఇంపార్టెన్స్ ఇస్తుంది.
ప్రాక్టికల్ గోల్స్ పెట్టుకోండి
లోన్ క్లియర్ చేయడం కోసం, వెకేషన్ కి వెళ్ళడం కోసం లేదా ఎమర్జెన్సీ ఫండ్ కోసం సేవ్ చేయడం. ఇలాంటి గోల్స్ పెట్టుకోండి. ఇవి మీ బడ్జెట్ దిక్సూచిగా మారతాయి, మీ స్పెండింగ్ డెసిషన్స్ కి మార్గనిర్దేశం చేస్తాయి.
లెక్కలు వేయండి
చిన్నపుడే వదిలేసినవి ఇప్పుడు వద్దు అనుకుంటున్నారా? ఆ లెక్కలు మనకి అవసరం లేదు లెండి. చిన్న చిన్న లెక్కలు చేద్దాం. మీ ఆదాయంలో నుండి మీ ఖర్చులని తీసేయండి. బాలన్స్ మీకు జీరో వస్తే పర్లేదు. అలా కాకుండా మీరు నెగిటివ్ అంటే మైనస్ బాలన్స్ ఉంటె మాత్రం మీరు ఖచ్చితంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.
ఉదాహరణకి మీరు రోజు బయట టిఫిన్ చేస్తారు అనుకుంటే, ఇంట్లో టిఫిన్ చేసుకోవడం వలన మీరు మీ టిఫిన్ ఖర్చును తగ్గించవచ్చు. టిఫిన్ అన్నాను కదా అని అది అనవసర ఖర్చా అని న మిద పడిపోకండి. ఉదాహరణకి చెప్పాను.
రివ్యూ చేయండి, సర్దుకొండి
మన ఆదాయం తో పాటుగా మన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీ బడ్జెట్ ని రివ్యూ చేయండి. మీ ఖర్చులకి తగ్గట్లు ప్లాన్ చేయండి. ప్రత్యేకించి మీ ఇన్కమ్ లేదా ఖర్చులు హెచ్చుతగ్గులకు లోనైతే, అవసరమైన విధంగా వర్గాలను సర్దుబాటు చేయండి.
బడ్జెట్‌ను రూపొందించడం యొక్క ప్రాముఖ్యత | Importance of Creating Budget
ఫైనాన్షియల్ క్లారిటీ
మీ బడ్జెట్ మీ ఫైనాన్షియల్ పోసిషన్ క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తుంది. నా డబ్బు అంత ఎమైపోతుందో అని చెప్పకుండా, ప్రతి రూపాయి ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది అని తెలుస్తుంది.
డెసిషన్ మేకింగ్ పవర్ ని స్ట్రాంగ్ చేస్తుంది
బడ్జెట్ తో మీరు, మీ ఖర్చులు కంట్రోల్ లో ఉంటాయి. మీరు మీ ఖర్చులు, మీ సేవింగ్స్ తో డెసిషన్స్ తీసుకోవచ్చు. బడ్జెట్ అనేది మీ డబ్బును మీ గోల్స్ కి అనుగుణంగా వినియోగించడానికి కావాల్సిన సూపర్ పవర్ లాంటిది.
అధిక వ్యయం నిరోధిస్తుంది
ఎప్పుడైనా మీరు మీ జీతం అంత ఏమైంది అని నెలాఖరులో అనుకున్నారా? అబ్బో చాలా సార్లు అని మీలో మీరే అనుకుంటున్నారా? అయితే మీరు బడ్జెట్ మైంటైన్ చేస్తుంటే, అది మీకు ఒక మార్గదర్శిగా పని చేస్తుంది. దేనికోసమైన అధికంగా ఖర్చు పెడుతూ, వేరే వాటి కోసం డబ్బు లేక ఇబ్బంది పడకుండా చేస్తుంది.
స్ట్రెస్ తగ్గిస్తుంది
అదేంటో డబ్బులు ఉన్నా స్ట్రెస్, లేకపోయినా స్ట్రెస్. అదేంటి బాబు డబ్బుల్లు లేకపోతే స్ట్రెస్ అంటే ఏంటో తెలుసు, డబ్బులు ఉన్నా కూడా స్ట్రెస్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారా? ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఉంటుంది లెండి. బడ్జెట్ మీకు డబ్బు సంబంధిత స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇది మీ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్. మీకు ఎదురయ్యే ట్విస్ట్స్, టర్నింగ్ పాయింట్స్ ని ఎదుర్కోవడంలో హెల్ప్ అవుతుంది.
ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడం
మీకు మీరు పెట్టుకున్న గోల్స్ ఉన్నాయా? బడ్జెట్ అనేది, మీ గోల్స్ దగ్గరికి తీసుకువెళ్ళే ఒక వెహికల్ లాంటిది. ఇది మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ త్యాగం చేయకుండా మీ లక్ష్యాలను చేరుకోవడానికి తగినంత నిధులను కేటాయించేలా చేస్తుంది.
ఎమర్జెన్సీ ప్రిపెరింగ్
జీవితం మనిషికి సవాళ్ళను విసురుతుంది. వాటిల్లో నూటికి 90% డబ్బుతో ముడిపడినవే. బడ్జెట్‌తో, మీరు అత్యవసర పరిస్థితుల కోసం బాగా సిద్ధంగా ఉంటారు. మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంది మరియు అది మీ ఫైనాన్షియల్ పజిల్‌కి ఎలా సరిపోతుందో మీకు బాగా తెలుస్తుంది.
ప్రకాశవంతమైన ఆర్థిక భవిష్యత్తు కోసం బడ్జెట్
బడ్జెట్ అనేది పరిమితి గురించి కాదు; అది సాధికారత గురించి. ఫైనాన్షియల్ డ్రీమ్స్ రియాలిటీగా మార్చే సాధనం ఇది. కాబట్టి, బడ్జెట్ ప్రయాణాన్ని స్వీకరించండి, దానిని మీ జీవనశైలికి అనుగుణంగా మార్చుకోండి మరియు మీ డబ్బు మీ జీవితంలో మంచి కోసం ఒక శక్తిగా మారడాన్ని చూడండి. ఆర్థిక విజయం మరియు ఒత్తిడి లేని డబ్బు నిర్వహణ ఇక్కడ ఉంది! 🚀💰
ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.