నైట్ అవుట్ అని తాగటం, సరదాగా షాపింగ్ కి వెళ్లి ఖరీదైన వస్తువులు లేదా బట్టలు షాపింగ్ చేయటం, వద్దు వద్దు అనుకుంటూనే బెట్టింగ్స్ వేయడం… ఇలాంటివి చేసేసిన తరువాత మనలో చాలా మంది బాధ పడుతుంటారు, అయ్యో అనవసరంగా ఇంత ఖర్చు చేసాం, అంత ఖర్చు చేసాం అని.
మీరు నేను కూడా అలా చేసే ఉంటాం ఎప్పుడోకప్పుడు. అప్పుడు మనకి ఇంకో సారి ఇట్లా చేయకుండా ఉండాలి అనిపిస్తుంది.
అదే మనం మన ప్రొఫెషనల్ లైఫ్స్ కి వచ్చేటప్పటికి మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ గుర్తించం. మనం ఎంత సేపు మన బిజినెస్ ని ఎలా గ్రౌ చేయాలి అనే ఆలోచిస్తూ ఉంటాం. అంతే తప్ప మనీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలి అని కాని, లేదా నేర్చుకోవటానికి కొంత సమయం కేటాయించాలి అని అనుకోము.
ఇది అన్నింటికన్నా పెద్ద తప్పు.
ఏ విధంగా బడ్జెట్ ని క్రియేట్ చేయల్లి, పొదుపుగా ఎలా ఖర్చు పెట్టాలి అని తెలుసుకోవడం వలన మనం అనేక ఆర్ధిక తలనొప్పులను దూరం చేసుకోవచు. అందుకే మనీ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం.
కాబట్టి ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యత గురించి, అదే విధంగా ఏవిధంగా మనం జాగ్రతగా ఎలా ఖర్చు పెట్టాలి అని తెలుసుకుందాం.
మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి?
మనీ మేనేజ్మెంట్ అంటే పేరులో ఉన్నట్లే మన దగ్గర ఉన్న డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అదే విధంగా ఏ విధంగా సేవ్ చేయాలి అని తెలుసుకోవడం.
ఇందులో బడ్జెట్ ని క్రియేట్ చేసుకోవడం నుండి దీర్ఘకాలిక ఆర్ధిక లక్ష్యాల (long-term finanacial goals) వరకు అన్ని ఉంటాయి. అంతే కాకుండా మనీ మేనేజ్మెంట్ అనేది అతి తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండే కమాన్ సెన్సు లాంటిదే, అత్యంత అరుదైన జీవన నైపుణ్యం.
మనీ మేనేజ్మెంట్ ఎందుకు ముఖ్యం?
మనీ మేనేజ్మెంట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటిలో ముఖ్యమైనది మీ యొక్క ఆర్ధిక కష్టాలను తప్పించుకోవడానికి.
మనీ మేనేజ్మెంట్ ద్వారా మీరు మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మీ ఖర్చులను ఏ విధంగా మేనేజ్ చేయడానికి, అంతే కాకుండా మిమ్మల్ని అప్పుల ఊబిలో పడకుండా కాపాడుతుంది.
మనీ మేనేజ్మెంట్ చేయకపోతే ఏమవుతుంది?
సరిగ్గా మనం మనీ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి అని ఇంతకూ ముందు చెప్పుకున్నాం కదా! అవేంటో ఇప్పుడు చూద్దాం.
1) అప్పుల్లో మునగటం
మీరు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రతగా లేకపోతే, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, అన్ని రకాల అప్పులు చేసేస్తాం. అప్పుడు ఖచ్చితంగా మీరు మళ్ళి మీ క్రెడిట్ కార్డ్స్ నుండి పెద్ద లోన్స్ లేదా పర్సనల్ లోన్స్ అని అనుకోని అప్పుల్లో మునిగిపోతాం.
అప్పు చేయడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడటమే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, దాన్ని తీర్చటానికి ఇంకొకటి ఇలా మనకి తెలియకుండానే అప్పుల ఊబిలో ఇర్రుక్కుపోతాం.
అంతే కాకుండా కొన్నిసార్లు పరువు ప్రతిష్టలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది.
2) ఆర్ధిక స్థిరత్వం లేకపోవటం
ఖర్చుల విషయంలో జాగ్రతగా లేకపోతే ప్రతి నెలాఖరుకు కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులకి కూడా ఇబ్బందులు కలిగించవచ్చు.
అంతే కాకుండా మనం పే చేయాల్సిన బిల్ల్స్ తో పాటుగా తిండి తిప్పలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. (ఇప్పుడు అలా ఎవరు ఉన్నారు గురు అని అనుకోకండి, ఎంతో మంది నెలాఖరుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని కథలు మనకి తెలుస్తాయి, కొన్ని కథలు మనకి తెలియవు. అంతే)
3. ఇల్లు లేకపోవడం
మన ఆర్ధిక నిరక్షరాస్యత కారణంగా కొన్నిసార్లు మనం సొంత ఇల్లు కూడా లేని పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. మనం కనుక గమనిస్తే ఎంతో కష్టపడి, ఎంతో సంపాదించి కూడా కనీసం తమకంటూ ఒక సొంత ఇల్లు లేని వాళ్ళు మన చుట్టూ ఉంటారు. దీనికి కారణం సరైన మనీ మేనేజ్మెంట్ లేకపోవడం.
మంచి మనీ మేనేజ్మెంట్ వాళ్ళ కలిగే లాభాలు
మనీ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోతే ఎన్ని నష్టాలూ ఉన్నాయో, సరిగ్గా మనీ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే అన్ని లాభాలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1. అప్పు చేసే అవకాశం తక్కువ
దాదాపుగా మనీ మేనేజ్మెంట్ సరిగ్గా చేయగలిగితే ఎంతో కొంత డబ్బు ప్రతీ నేలా సేవ్ చేయగలుగుతారు. కాబట్టి అప్పు చేయవలసిన అవసరం ఉండదు. ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే ఖర్చులు చేస్తారు కాబట్టి అప్పు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
2. మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వగలరు.
ఆర్థికంగా మీ లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అని మీకు ఒక ఐడియా ఉంటె, వాటిని రీచ్ అవ్వటానికి మరిన్ని మార్గాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు EMI పే చేయాల్సి ఉంటే, మీరు అనవసర ఖర్చులు తగ్గించుకోగలిగితే మీరు ఇంకా కొంచెం సేవింగ్స్ చేయగలుగుతారు.
3. మంచి రిటైర్మెంట్
మంచి మనీ మేనేజ్మెంట్ స్కిల్ల్స్ హ్యాపీ రిటైర్మెంట్ కి దారి తీస్తుంది. జాగ్రతగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఛాయస్లు చూస్ చేసుకుంటే గోల్డెన్ ఇయర్స్ ని ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండవచ్చు.
ఈరోజు నుండే మనీ మేనేజ్మెంట్ ప్రాక్టిస్ చేయడం స్టార్ట్ చేయండి.
పర్సనల్ ఫైనాన్సు నేర్చుకోవడం ద్వారా, మంచి ఇన్వెస్టింగ్ అలవాట్ల ద్వారా మనం ఎన్నో ఆర్ధిక ఇబ్బందులలో ఇబ్బంది పడకుండా, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వచ్చు.
ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.